వేపాకుతో ఎన్ని ఆయుర్వేద లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.. ఎన్నో సుగుణాలు ఉండే ఈ వేపాకుతో అందానికి ఎన్నో లాభాలు పొందుతారు. అయితే ఆ లాభాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. వేపాకుతో అందంగా ఆరోగ్యంగా మెరిసిపోండి. 

 

వేపాకులను మరిగించిన నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది.. అంతేకాదు యాక్నె, ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పడతాయి. 

 

వేపాకును పేస్ట్ గా తయారు చేసి అందులో కొద్దిగా పసుపు చేర్చి ఒంటికి పట్టించుకోని స్నానం చేస్తే వేసవిలో వచ్చే పొక్కులూ, చెమట కాయల వెంటనే పోతాయి. 

 

గ్లాస్ నీళ్లలో గుప్పెడు వేపాకులను వేసి బాగా మరిగించి ఆతరవాత ఆ నీళ్లని వడకట్టి.. సీసాలో తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు పట్టించుకుంటే చెమట వాసన దూరం చేస్తుంది. కాబట్టి దుర్వాసన ఎక్కువ వచ్చే వారు ఈ నీళ్లను ఉపయోగిస్తే మంచిది. 

 

చుండ్రు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఈ సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.. చెప్పాలంటే ఇది పెద్ద వైరస్..  వేపాకులు వేసి మరిగించిన నీళ్లని వడకట్టి.. కండిషనర్‌లా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: