కర్బుజా పండు.. వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. ఎక్క‌డి చూసినా ఇవే ద‌ర్శ‌నం ఇస్తుంటాయి. శరీరంలోని అధికవేడిని దూరంచేసే ఫలాల్లో కర్బూజ ఒకటి. కర్బూజాలో అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది. అందుకే ఈ పండు అంటే చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడతారు. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది. ఆరోగ్య‌ప‌రంగా కర్బుజా వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అంతేనా అంటే కాదండోయ్‌.. క‌ర్బుజా వ‌ల్ల చ‌ర్మానికి కూడా బోలెడంత మేలు ఉంది.

 

అందుకు ముందుగా కర్బూజ పండు గుజ్జు తీసుకు ఫేస్‌కు అప్లై చేయాలి. పావు గంట సేపు తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిపోవ‌డ‌మే కాకుండా.. ముఖంగా కాంతివంతంగా కూడా మారుతుంది. అలాగే కర్బూజ పండు గుజ్జు, తేనె, కొద్దిగా రోజ్ వాట‌ర్‌ కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. 

 

ఇది చర్మం మృదువుగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో ఎంతో చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అదేవిధంగా, కర్బూజ పండు గుజ్జులో కొద్దిగా ముల్తానిమట్టి కలిపి ఫేస్‌కు అప్లై చేయాలి. ఇలా చేసిన అర‌గంట‌ తర్వాత చల్లటి నీటితో క్లీన్‌ చేసుకోండి. ఈ ప్యాక్ చర్మాన్ని తేమగా మార్చడానికి, అవసరమైన పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. మ‌రియు ముఖంపై ఉన్న మ‌లినాల‌ను తొల‌గిస్తుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: