సాహ‌జంగా అమ్మాయిలు మ‌రింత అందంగా క‌నిపించ‌డానికి మేక‌ప్‌ను ఎంచుకుంటారు. వాస్త‌వానికి అమ్మాయిలు తమ ముఖారవిందానికి మరింత మెరుగులు దిద్దుకోవడం యుగాలుగా ఉన్నదే. అయితే కాలానుగుణంగా అతివల మేకప్‌ రీతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ సౌందర్యం రెట్టింపు చేయడంలో కళ్లే కీలకం. అది సాధ్యం కావాలంటే కొద్దిపాటి అలంకరణ తప్పనిసరి. అలా క‌ళ్లు అందాన్ని రెట్టింపు చేసే మేక‌ప్ సాధ‌న‌ల్లో మ‌స్కారా కూడా ఒక‌టి. అయితే దాన్ని ఉప‌యోగించేట‌ప్పుకు కొన్ని విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

 

కళ్లు అన్నిటికంటే సున్నితమైనవి కాబట్టి వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ద ఖ‌చ్చితంగా తీసుకోవాలి. ఇందులో భాగంగా క‌ళ్ల‌కు యూజ్ చేసే సౌందర్య ఉత్పత్తులను ఆరునెలలకోసారి త‌ప్ప‌కుండా మార్చాలి. అయితే మస్కారా విషయంలో ఇంకాస్త ముందుగానే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు. ఎంత బ్రేండెడ్ అయినా ప్రతి మూడు నెలలకొక్కసారి మస్కారాను మార్చాల్సిందే. ఎందుకంటే.. ఇందులో ఉండే బ్యాక్టీరియా చేరి కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలున్నాయి. అలాగే ఐ మేకప్ అంతా పూర్తయిన తరువాత మస్కారాను ఉపయోగించాలి. ఎందుకంటే ఇది ఐ మేకప్ లో లాస్ట్ స్టెప్.

 

అదేవిధంగా, రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి మేక‌ప్ కంటే ముందు సెన్సిటివ్ కళ్లున్న వారు కంటికి పెట్టుకొన్న కాటుక, ఐలైనర్ తో పాటు మస్కారాను కూడా ఖచ్చితంగా తొలగించాల్సిందే. లేదంటే మరుసటి రోజు కళ్లు నీరసంగా కనిపిస్తాయి. మ‌రియు కొత్త మస్కారాను యూజ్ చేసేట‌ప్పుడు ముందు అరచేతిపై కాస్త రాసి, కొంత సమయం వరకూ వేచి చూడాలి. చేతిపై ఎలాంటి దురద, ఇతర ఇన్ఫెక్షన్స్ రాకపోతే అప్పుడు మాత్రమే దాన్ని కనురెప్పలకు అప్లై చేయాలి.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి: