ఈ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం తేనె కూడా ఒకటి. పల్లెలు, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతి చోట తేనే లభిస్తుంది. ఇక ఎన్ని సం వత్సరాలు నిలువ ఉంచినా, చెడిపోకుండా, పోష కాలు ఏ మాత్రం తగ్గకుండా  మ‌రియు అదే రుచితో ఉండే పదార్థం ప్రపంచం అంతటిలోకి ఒక్క తేనె మాత్రమే అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ తేనె ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. తేనె తీసుకునే విధానం బట్టి వివిధ రకాలుగా మీ శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే తేనె ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

 

ఇది తెలిసిన విష‌య‌మే అయినా దీన్ని ఎలా ఉప‌యోగిస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌దు. ఆ విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు ముందుగా రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసుకుని పావు గంట‌ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు కూడా త‌గ్గుతుంది. అలాగే ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను ఓట్‌మీల్స్‌ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో కలిపి దాన్ని ముఖానికి రాసుకుని అర గంట త‌ర్వ‌తా క్లీన్ చేసుకోవాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చర్మంపై మృతకణాలు, మలిన పదార్థాలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మం మృదువుగా, పట్టులా కనిపిస్తుంది. అదేవిధంగా, కొబ్బరి నూనె మరియు తేనె క‌లిపి పెదాల‌కు అప్లై చేయ‌డం వ‌ల్ల‌ పెదాలకు మాయింశ్చరైజింగ్ గా ఉపయోగ‌ప‌డుతుంది. తేనెలోని తియ్యదనం పెదాలకు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు రిఫ్రెష్ గా కనబడుటకు సహాయపడుతుంది. మ‌రియు ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకోవాలి. అర గంట పాటు అలాగే ఉంచి.. ఎండిన తర్వాత గోరువెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవ‌డం. ఇలా చేయ‌డం చర్మఛాయ మెరుగుపరచడంలో పాటు.. ముఖం కాంతివంతంగా క‌నిపించేలా చేస్తుంది.
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: