అంద‌రిలోనూ అందంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు. కానీ, మ‌న‌కు ఎదుర‌య్యే చ‌ర్మ స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు. మొటిమ‌లు, వాటి వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చులు, పొడి చ‌ర్మం ఇలా ఒక‌టా.. రెండా ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. కానీ, మ‌నం చేసే చిన్న త‌ప్పుల వ‌ల్ల కూడా చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే ఇలా బాధ‌ప‌డుతున్న‌వారు నిద్రపోయే ముందు ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఈజీ టిప్స్‌ను పాటిస్తే ఎన్నో సౌంద‌ర్య‌ లాభాలు పొందొచ్చు. 

 

కొంత మంది పడుకునే ముందు ముఖాన్ని దిండుకు ఆనించి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడుతలు ఏర్పడుతాయి. కాబ‌ట్టి.. ఇక‌పై అలా చేయ‌డం మానుకోండి. ఇక శరీరం ఎలా అయితే అలసి పోతుందో అలాగే చర్మం కూడా అలిసిపోతుంది. దీని వల్ల చర్మంలో ఉండే కణాలు మొత్తం నిర్జీవంగా మారి అందవికారంగా తయారవుతారు. కొందరు నిద్రకు ఉపక్రమించే ముందు అదేపనిగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. దీనివల్ల కళ్లకు ఎంత ఇబ్బంది కలుగుతుంది మీ అందంపై కూడా అంతే ప్రభావం చూపుతుంది. కాబ‌ట్టి.. ఇక‌నుంచి అయినా రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడ‌కుండా ప‌క్క‌న పెట్టి ప్ర‌శాంతంగా ప‌డుకోండి. 

 

అదేవిధంగా, కొందరు వీకెండ్స్ లో బాగా తిరిగివచ్చి అలాగే పడుకుంటూ ఉంటారు. అలాకాకుండా పడుకునేముందు మీ చర్మసంరక్షణ కోసం బాగా పని చేసే సహజసిద్దమైన క్రీములు వాడితే ఉత్తమం. మ‌రియు పడుకునేముందు వీలైనంత వరకు కొన్ని పానీయాలను తాగకుండా ఉండడమే మంచిది. కాఫీ, కూల్ డ్రింక్స్, చక్కెరతో కూడిన పండ్లరసాలు, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి మీకు నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తాయి. ఆ ప్రభావం మీ చర్మంపై పడుతుంది. దీంతో స్కిన్ డ‌ల్‌గా క‌నిపిస్తుంది. ఇక రాత్రిళ్లు మాత్రం మేక‌ప్‌తో మాత్రం అస్స‌ల నిద్ర‌పోకూడ‌దు. దీని వ‌ల్ల అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అందుకే ప‌డుకునే ముందు మేక‌ప్ తొల‌గించి.. నీటితో ముఖం శుభ్రం చేసుకుని ప‌డుకోవాలి.

  

మరింత సమాచారం తెలుసుకోండి: