లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఎండలు చూస్తే ఘోరంగా ఉన్నాయ్.. ఇంట్లో ఉన్న సరే.. చేతికి ఏది అందితే అది తినడం వల్ల అందం దెబ్బ తినింది.. ఇంకా అలాంటి ఈ సమయంలో ఏం చేస్తాము? ఇంట్లో ఉండే ఉత్త్పత్తులను ఉపయోగించి అందాన్ని కాపాడుకుంటాం.. ఇంకా అలాంటి అందాన్ని కాపాడే చిట్కాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

పాలు, తేనె కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత తీసేస్తే అందంగా తయారవుతారు.. 

 

పసుపులో రోజ్ వాటర్ కలిపి ట్రై చేస్తే అందంగా తయారవుతారు. 

 

జుట్టుకు మాస్క్‌లా పెరుగునీ కూడా ఉపయోగించచ్చు. పెరుగుని జుట్టుకు పట్టించి పావుగంట తరువాత కడిగేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది.

 

ఓట్స్‌, తేనె, ఆలివ్‌ ఆయిల్‌ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేసుకొని చల్లటి నీటితో కడిగేస్తే వేసవిలో చర్మం నిగారింపు కోల్పోకుండా మెరిసిపోతుంది. 

 

సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు, చేతులకు ప్యాక్‌లా వేసుకొని కడిగేస్తే మెరిసిపోతుంది. 

 

జుట్టు సంరక్షణ కోసం వేడినూనెతో తలపై మర్దన చేసుకొని ఆ తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగిస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది.                                                                                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: