పాలు.. మన ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  పాలలో ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా కాల్షియం, పాస్పరస్, విటమిన్ డి వంటివి పాల ద్వారా శరీరానికి అందుతాయి. అంతే కాదు కండరాలు, రక్తనాళాల విధిని మెరుగుపరిచి, ఎముకలు, దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి. అలాగే ప్ర‌తిరోజు పాలు తాగ‌డం వ‌ల్ల జీర్ణక్రియను పెంచుతుంది కూడా. అటువంటి పాలు ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా స్కిన్‌పై ఉండే మచ్చ‌లు త‌గ్గించ‌డంతో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మ‌రి పాల‌ను ఎలా యూజ్ చేస్తే.. మెరుగైన చ‌ర్మాన్ని పొంద‌గ‌లం అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

 

వాస్త‌వానికి పాలు మరియు పాల ఉత్పత్తులలోని లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేయబడింది. అందుకే ఒక కాటన్ బాల్ ను పాలలో నానబెట్టి.. స్కిన్‌పై మ‌చ్చ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. రోజుకు రెండు సార్లు ఈ టిప్స్ చేస్తే.. మంచి ఫ‌లితం ల‌భిస్తుంది. స్కిన్‌పై ఉండే మ‌చ్చ‌లు నివారణలో పాలు సమర్థవంతమైన గృహ నివారణ చిట్కాగా సూచించబడుతుంది. ఇక పాల‌తో స్కిన్‌పై ఉండే మచ్చ‌లు తొలిగించుకోవ‌డానికే కాదు మ‌రెన్నో ఉప‌యోగాలు ఉన్నాయి.

 

అందుకు ముందుగా చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమపువ్వు పొడి, శెనగపిండి తీసుకుని మీక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకొని కాసేపాగిన తర్వాత శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మం రంగుని ఫెయిర్ గా చేయడంతో పాటు మచ్చలేని అందాన్ని మీకు ఇస్తుంది. అలాగే శనగపిండి, పాలు చర్మ సౌందర్యానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, పావు కప్పు పాలు, స్పూన్ తేనె బాగా కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. కాసేపు మర్దనా చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే.. స్కిన్ స్మూత్ గా మారుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: