యుక్తవయస్కులను ఎక్కువగా వేధించే స‌మ‌స్య మొటిమలు. ఇలా మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. జిడ్డు చర్మం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, జంక్‌ ఫుడ్‌, నూనెతో కూడిన పదార్థాలు ఎక్కువగా తినడం మొటిమలకు ప్రధాన కారణాలు. కొందరికి వయసుతో పాటు తగ్గిపోయినా కొందర్ని మొటిమలు వీడకుండా ఇబ్బందిపెడతాయి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య అంత త్వరగా తగ్గదు. ఏదైనా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భంలో చ‌క్క‌టి దుస్తులున్నా.. ఎంత‌మంచి మేక‌ప్ ఉన్నా.. ముఖంపై ఉన్న మొటిమలే మ‌నం అందంగా ఉన్నామ‌న్న భావ‌న‌ను తొల‌గించేస్తాయి.

 

అయితే మొటిమ‌ల‌ను పెసరపప్పు ఈజీగా త‌గ్గిస్తుంది. మ‌రి ఇందుకు ఏం చేయాలి..? పెసరపప్పును ఎలా ఉప‌యోగించాలి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గుప్పెడు పెసలని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి. అందులో కొంచెంగా నెయ్యి కలిపి మొటిమ‌లు ఉన్న చోటు మ‌రియు ముఖానికి కూడా అప్లై చేయండి. ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ పది నిమిషాలుంచండి. ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేయండి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గ‌డానికి ఇది ఓ చ‌క్క‌టి ప‌రిష్కారం. 

 

అలాగే మొటిమల సమస్య బాధిస్తుంటే..  గుప్పెడు పెసల్ని రాత్రంతా నీటిలో నానబట్టి పొద్దున్న మెత్తగా రుబ్బండి. ఇందులో అలోవెరా జెల్ వేసి కలపండి. ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోటు మ‌రియు ముఖానికి కూడా అప్లై చేయండి. అర‌గంట‌ తర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి. మ‌రియు  పెసల్ని రాత్రంతా నీటిలో నానబట్టి పొద్దున్న మెత్తగా రుబ్బి.. అందులో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోటు మ‌రియు ముఖానికి కూడా అప్లై చేయండి. అర‌గంట‌ తర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మొటిమ‌లు ఈజీగా త‌గ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: