సాధార‌ణంగా మనిషి అందాన్ని రెట్టింపు చేసే వాటిలో జట్టు కూడా ఒక‌టి. అందుకే త‌మ జుట్టు పొడ‌వుగా, ఆరోగ్యంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. జుట్టు రాలుతోందని తెలిస్తే చాలు ఏదో ఆందోళన. జుట్టు రాలిపోవ‌డ‌మే కాదు.. చండ్రు, పొడిబారం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా పోషకాహారలోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్‌, మద్యం, స్మోకింగ్, విపరీతమైన ఒత్తిడి కారణంగా,  కెమికల్‌ హెయిర్‌ ప్రాడెక్టులు వినియోగించడం ఇలా ఎన్నో కార‌ణాలు చెప్పుకోవ‌చ్చు. అలాగే ప్రస్తుతమున్న కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

 

ఇక జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం చెయ్యాలా అని రకరకాల షాంపూలూ, క్రీములూ వాడతారు. అవేవీ పనిచెయ్యకపోతే, చివరకు హెయిర్ లాస్ ట్రీట్‌మెంట్లు కూడా చేయించుకుంటారు. అయినా సంతృప్తి కలగదు. ఇంతలా వేధిస్తున్న ఈ సమస్య ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంది.. అయితే జ‌ట్టు ఒత్తుగా, పొడవుగా ఎదగడానికి పార్లర్‌కి, సెలూన్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటిస్తే.. స‌రిపోతుంది. అయితే వంట గదిలో ఉండే అల్లం... మన జుట్టుకు మేలు చేస్తుందని చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. 

 

అవును! అల్లం జుట్టు సంర‌క్ష‌ణ‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజాగా ఉండే అల్లం ముక్కలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, చాలా విటమిన్లు ఉంటాయి. అవి జుట్టును మెరిసేలా చెయ్యడంతొ పాటు బలంగా, ఒత్తుగా అయ్యేలా కూడా చేస్తాయి. అందుకే అల్లం రసాన్ని జుట్టుకు పట్టించి... ఓ అరగంట జుట్టును ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో లేదా షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గి.. ఒత్తుగా పెరుగుతుంది. అలాగే అల్లం నూనె  జుట్టుకు పట్టిస్తే... ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లైనా ప‌రార్ అవ్వాల్సిందే. ఇక అల్లం ముక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్... మన జుట్టుపై వాలే విషవ్యర్థాల్ని తరిమికొడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: