స్నానం.. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ ఇది ఒక డైలీ రోటూన్‌‌. స్నానం చేయ‌డం వ‌ల్ల‌ శరీరంపై ఉండే మలినాలను తొలగిస్తుంది. అయితే మన శరీరం శుభ్రం చేసుకోవడానికి రకరకాల పద్దతులను పాటిస్తాం. ఈ నేపథ్యంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు మీ జుట్టుని, చర్మాన్ని హాని చేస్తాయి. ఇక వీటి నుంచి తప్పించుకునేందుకు నిపుణులు కొన్ని సలహాలిస్తున్నారు. అందులో ముందుగా.. సాధార‌ణంగా కొంతమంది త‌మ చ‌ర్మం అందంగా, తెల్లగా అయిపోవాలనే ఆత్రుతతో ఎక్కువ సేపు శరీరంపై స్క్రబ్ చేస్తారు. అలా చేయడం వల్ల చర్మ పై భాగం పగిలిపోయి ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుందట.

 

దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు నీళ్లు చాలా వేడిగా ఉంటే.. జుట్టు రాలడాన్ని, చుండ్రుని విపరీతంగా పెంచే అవకాశాలుంటాయి. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీటిని యూజ్ చేయ‌డం మంచిదంటున్నారు నిపుణులు. తలస్నానం మొత్తం అయిపోయిన తర్వాత చివరిసారిగా.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్ల మూసుకుపోయి.. రాలిపోకుండా అడ్డుకుంటుంది. కానీ, చాలా మంది ఇలా చేయరు. కాని, ఇప్ప‌టి నుంచి అయినా ఈ దీన్ని పాటించండి.

 

అదేవిధంగా, ప్రతిసారి తలస్నానానికి ముందు తల దువ్వుకోవాలి. దీనివల్ల జుట్టు రాలడం కొంతైనా తగ్గుతుంది. జుట్టు చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల.. తడిగా ఉన్నప్పుడు మరింత ఎక్కువ సెన్సిటివ్ గా మారి.. జుట్టు రాలడానికి కారణమవుతుంది. అలాగే చాలా మంది షవర్ కింద గంట‌లు గంట‌లు స్పానం చేస్తారు. కానీ, వాస్త‌వానికి ఎక్కువ సమయం పాటు షవర్ లో ఉంటే స్కిన్ లో ఉండే మాయిశ్చర్ శాతం తగ్గిపోయి స్కిన్ డ్రై గా మారిపోతుందట. ఫలితంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయట. మ‌రియు వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. వేడినీళ్లతో స్నానం అప్పుడు బాగా అనిపించినా.. తర్వాత చర్మానికి హాని చేస్తుంది. సో.. ఈ విష‌యంలోనూ జాగ్ర‌త్త వ‌హించండి.

 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: