సాధార‌ణంగా తాము అందగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని అనుకోని వారుండ‌రు. కానీ అది పొందడం మాత్రం చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. చాలామంది అందంగా సిద్ధమవ్వాలి అనుకునే రోజుకే ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. దీంతో అందాన్ని మెరిపించుకోవ‌డానికి ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అనే ఫేస్ క్రీముల‌తో పాటు మాయిశ్చరైజర్ల‌ను యూజ్ చేస్తుంటారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్లు మ‌న‌ రోజువారీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ బాగా తెలుసు. ఇది చర్మం మీద ఒక రక్షిత పొరలా ఏర్పడి మన చర్మాన్ని రక్షిస్తుంది. 

 

అంతేకాకుండా ఇది మన చర్మం నిర్జలీకరణం మరియు నిస్తేజంగా మారకుండా నిరోధిస్తుంది. అయితే ఇంట్లో త‌యారుచేసుకుని న్యాచుర‌ల్ మాయిశ్చరైజర్స్ తో అద్భుత లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అందులో ముందుగా.. ఓ టేబుల్ స్పూన్ కొబ్బరినూనెని తీసుకోండి. ఇందులో హాఫ్ టీస్పూన్ రోజ్‌వాటర్ వేసి బాగా కలపండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖం, చర్మంపై బాగా మర్దనా చేయండి. కొబ్బరినూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని ఉపయోగించ‌డం చ‌ర్మానికి చాలా మంచిది. అలాగే పాలలో మంచి మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. దీన్ని యూజ్ చేసి కూడా చర్మాన్ని మెరిపించొచ్చు. 

 

ఇందుకోసం కొద్దిగా పాలు తీసుకుని అందులో పావు శాతం తేనె కలపాలి.. ఇలా తయారైన మివ్రమాన్ని మాయిశ్చరైజింగ్‌లా వాడుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక బాదం నూనె కూడా మంచి మాయిశ్చరైజింగ్‌గా పనిచేస్తుంది. బాదం, కొబ్బరి, నువ్వులనూనెలను సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలపాలి. దీన్ని యూజ్ చేయ‌డం  వల్ల సిల్కీ స్కిన్‌ మీ సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రియు ఓ స్పూన్ బాదం నూనెలో కాసింత తేనె కలిపి చ‌ర్మానికి మర్దనా చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల త్వరగానే చర్మంలో మంచి నిగారింపు వస్తుంది. వీటితో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే చర్మం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. చ‌ర్మం కూడా నిగారింపుగా క‌నిపిస్తుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: