సాధార‌ణంగా త‌మ చ‌ర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. ఇందుకు ఏవేవో ప్ర‌యోగాలు కూడా చేస్తారు. ముఖ్యంగా వేల‌కు వేలు త‌గ‌లేసి అనేక క్రీములు వాడుతుంటారు. కానీ, మంచి ఫ‌లితం లేక నిరాశ చెందుతుంటారు. వాస్త‌వానికి ఆరోగ్యకరమైన మరియు అందమైన చర్మాన్ని పొందడానికి కృత్రిమ రసాయనాలవైపు మొగ్గు చూపడం అంత శ్రేయస్కరం కాదు. అయితే అందంగా మెరిసిపోవాలంటే వంటింట్లో దొరికే వస్తువులతోనే ఆరోగ్యవంతమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా, నిమ్మ‌ర‌సం మ‌రియు పెరుగు.

 

ఇందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పెరుగు, కొద్ది నిమ్మ‌రసం కావాల‌నుకుంటే కొద్దిగా చ‌క్కెర‌ వేసుకుని ముఖానికి ప‌ట్టించాలి. ఒక పావు గంట త‌ర్వాల చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మృదువైన, నిగనిగలాడే చర్మం పొందొచ్చు. అంతేకాదు, ముఖంపై ఉన్న ఇది నల్లమచ్చలను తొలగించడంతో పాటు మృతకణాలను కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ ప్యాక్ వేసవిలో వేసుకోవ‌డం వ‌ల్ల‌ చర్మానికి తగిన తేమ లభిస్తుంది. వాస్త‌వానికి పెరుగు మన చర్మానికి అవసరమైన లాక్టిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అద్భుతమైన కాస్మెటిక్. 

 

పెరుగులో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని పోషకంగా మరియు తేమగా మారుస్తాయి. మ‌రియు పెరుగు చర్మ సమస్యలను సహజంగా నయం చేస్తుంది. అలాగే నిమ్మకాయ యొక్క సౌందర్య ప్రయోజనాలు అందరికీ  తెలిసినదే. నిమ్మ‌లో ఉండే విటమిన్ సి చర్మాన్ని లోతుగా శుద్ది చేయడంలో మరియు చర్మరంధ్రాలలోని మృత కణాలను తొలగించి, చర్మరంద్రాలను తెరవడంలో సహాయపడుతుంది. మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నిమ్మ‌ర‌సం మ‌న చ‌ర్మానికి మేలు చేస్తుంది. స్కిన్ మెరుస్తుంది. మృదువుగా, కోమలంగా త‌యార‌వుతుంది. ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న పెరుగు, నిమ్మ‌ క‌లిపి వాడితే ముఖం అందంగా మారుతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: