సాధార‌ణంగా ఇటీవ‌ల కాలంలో పెర్ఫ్యూమ్స్‌ను అంద‌రూ వినియోగిస్తున్నారు. అస‌లు పర్‌ఫ్యూవమ్‌ లేనిదే బయటికి వెళ్లడానికి కూడా చాలా మంది ఇష్టపడ‌రు. చ‌క్క‌టి ప‌రిమ‌ళం అనేది మ‌న‌లో నింపే ఉత్సాహ‌మే వేరుగా ఉంటుంది. మ‌రియు ఒంటి నుంచి దుర్వాస రాకుండా అడ్డుకునేందుకు చాలా మంది పెర్ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇక మార్కెట్లో రోజూ కొత్త‌కొత్త బ్రాండ్లు వ‌స్తూ ఉండ‌డంతో పెర్ఫ్యూమ్‌ల ఎంపిక‌లో వివిధ ర‌కాల‌ను ఎంచుకునే వీలు క‌లిగింది. అయితే రోజూ మీరు వాడే పెర్ఫ్యూమ్ వల్ల మీకు లాభాలెన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయన్న విషయం ఖ‌చ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

 

వాస్త‌వానికి కొంత మంది ఎంతో ఇష్టంగా పెర్ఫ్యూమ్ వాడుతారు. కొంతమందికి ఇది అంతగా ఇష్టముండదు. అందుకే అంతలా వాడరు. ఎప్పుడో ఓ సారి పెర్ఫ్యూమ్ వాడతారు. అలాంటివారికి పెర్ఫ్యూమ్స్ ఎక్కువ రోజులు వస్తాయి. అలాంటప్పుడు వాటిని ఉన్నాయి కదా అని సంవత్సరాలు సంవత్సరాలు వాడొద్దు. నిజానికీ సంవత్సరానికి మించి పెర్ఫ్యూమ్స్ స్మెల్స్ రావు. మ‌రియు ఇత‌ర సైడ్ ఎఫెక్ట్స్‌కు గురిచేస్తాయి. కాబట్టి.. వీటిని సంవత్సరంలోపే వాడాలి. ఇక పెర్ఫ్యూమ్ వాడే ప్రతి ముగ్గురిలో ఒకరు తలనొప్పి, ఆస్తమా మరియు ఫర్ ఫ్యూమ్ కి సున్నితంగా ఉండి ర్యాష్ లు వంటి లక్షణాలను కలిగివుంటారని నిపుణులు అంటున్నారు. అలాగే అధికంగా పెర్ఫ్యూమ్స్ వాడడం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుంది. 

 

అది నానాటికీ ఎక్కువై, వైద్యానికి కూడా అందనంత స్థాయికి చేరుతుందంటున్నారు పరిశోధకులు. అందువల్ల వీలైనంతవరకూ పెర్ఫ్యూమ్స్‌కి దూరంగా ఉండమంటున్నారు. ఖ‌చ్చితంగా అవ‌స‌రం అనుకుంటే త‌ప్పా.. వీటి జోలికి వెళ్ల‌వ‌ద్దంటున్నారు నిపుణులు. ఇక చాలా మంది పువ్వులతో తయారు చేసిన పర్‌ఫ్యూమ్‌లను యూజ్ చేస్తారు. పువ్వులతో తయారు చేసేటప్పుడు వాటిలో కొన్ని పండ్ల ఫ్లెవర్స్‌ను చేర్చడం వల్ల అవి సుగంధం భరితంగా ఉంటాయి. ఈ పర్‌ఫ్యూమ్స్ యూజ్ చేయ‌డం వల్ల చెమట వాసన దూరం కావటంతో పాటు చుట్టూ సహజమైన గంధం వాసనను వెదజల్లుతాయి. అలాంటి వాటినే ఉప‌యోగిస్తే మేలంటున్నారు నిపుణులు.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: