సబ్జా గింజలు.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.  వేసవిలో వడదెబ్బ నుంచి త‌ప్పించుకోవాలంటే సబ్జానీళ్లు ఖ‌చ్చితంగా తాగాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న సంగ‌తి తెలిసిందే. సబ్జా గింజల్లో ముఖ్య గుణం శరీరంలో వేడినీ తగ్గించడం. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ ని తగ్గించే అతి శక్తి వంతమైన ఆహారపదార్థాలలో సబ్జాగింజలు ఒకటి. అందుకే సబ్జా గింజలు పోషకాల నిధులు. వీటిని ఫలూదా గింజలు, తుర్కుమేరియా గింజలు అని కూడా అంటారు. వీటిల్లో కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు కూడా పుష్కలం. 

 

చౌకగా లభించే ఈ గింజలు అద్భుతమైన శక్తిని ఉత్తేజాన్ని నింపుతాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఇక శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. అందుకే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు.. డైట్‌లో ఖ‌చ్చితంగా సబ్జానీరు చేర్చుకుంటారు. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. అవి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లేదా వాట‌ర్‌లో క‌లుపుకుని తాగితే.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. అయితే సబ్జా గింజలు కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.. అందానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

మ‌రి స‌బ్జా గింజ‌ల‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా.. ఒక బౌల్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల పాలు తీసుకుని అందులో అర టీ స్పూన్ స‌బ్జా గింజ‌లు వేయాలి. ఇప్పుడు దీన్ని రెండు గంట‌ల పాటు అలా వ‌దిలేయాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మిక్సీ జార్‌లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఈ స‌బ్జా పేస్ట్‌ను ముఖానికి, మెడ‌కు అప్లై చేయాలి. అరగంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న మ‌లినాల‌ను, మ‌చ్చ‌ల‌ను తొలిగిస్తుంది. అంతేకాకుండా.. ముఖాన్ని అందంగా, తాజాగా మెరిసేలా చేస్తుంది. కాబ‌ట్టి, ఈ ఫ్యాక్ ఖ‌చ్చితంగా ట్రై చేయండి.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: