అందంగా, ఆక‌ర్ష‌ణీంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కానీ, అంత‌లోనే ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతుంటుంది. ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏవేవో ప్ర‌త్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో చాలా మందిని వేధించే ప్ర‌ధాన స‌మ‌స్య స్కిన్ పిగ్మెంటేషన్. అంటే చర్మంపై ముదురు రంగులో ఏర్పడిన డార్క్ పాచెస్ లేదా న‌ల్ల మ‌చ్చ‌లు. ఇవి ఒక్క‌సారి వ‌చ్చాయంటే.. అంత తొంద‌ర‌గా పోవు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.. ఈజీగా మీ ముఖంపై ఉన్న మ‌చ్చ‌ల‌ను పోగొట్టుకోవ‌చ్చు.

 

అందులో ముందుగా.. ఒక కాటన్ బాల్ ను పాలలో నానబెట్టి.. న‌ల్ల మ‌చ్చ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. మెరుగైన రిజల్ట్‌కై రోజులో రెండుసార్లు రాయండి. వాస్త‌వానికి పాలు మరియు పాల ఉత్పత్తులలోని లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే రాత్రి పడుకోబోయే ముందు టొమాటో రసాన్ని ముఖానికి రాసుకోండి. ఉదయాన్నే లేచి కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఉన్న న‌ల్ల మ‌చ్చ‌లు త‌ప్ప‌కుండా త‌గ్గిపోతాయి.

 

అదేవిధంగా, దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలిపి ముఖానికి రాసుకోండి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ఇక‌ ఉల్లిపాయలు పొడిబారిన చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతేకాకుండా ముఖంపై ఉన్న న‌ల్ల మ‌చ్చ‌ల‌ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇందుకు ముందుగా మీ ముఖాన్ని చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుని.. అనంత‌రం న‌ల్ల మ‌చ్చ‌ల‌పై ఉల్లిపాయ ర‌సాన్ని అప్లై చేయాలి. ఆరిన త‌ర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారినికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫ‌లితం పొందొచ్చు. వీటితో పాటు జంక్ ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండ‌డం కూడా చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: