సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జీవితంలో ఏదో ఒక సంద‌ర్భంలో వివిధ రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. పొడి చర్మం, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, జిడ్డు చ‌ర్మం ఇలా అనేక స‌మ‌స్య‌లు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇక ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాయని భావించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి నిరాశ చెందుతాము. వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది మరియు వ్యయాన్ని తగ్గించేవి కావు. ఆఖరికి ఇవి ఏ సమస్యను సహజాంగా నివారించలేవు. అందుకే స‌హ‌జ చిట్కాల‌ను ఎంచుకోవ‌డం మంచిదంటున్నారు నిపుణులు.

 

అయితే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతో పంచ‌దార బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంట్లో తీపి కావాలంటే వెంటనే పంచదార డబ్బా తీస్తాం. మ‌న డైలీ డైట్‌లో ఇది ఒక భాగం అని చెప్పుకోవ‌చ్చు. అయితే అధికంగా పంచదారను ఉపయోగించే వాళ్ళు బరువు పెరగడంతో పాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కానీ, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తొలిగించ‌డంలో పంచ‌దార ఎంతో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఒక నేచురల్ బ్యూటీ వస్తువు. చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. పంచదారతో మరో గొప్ప ప్రయోజనం ఇది చర్మంలో ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది.

 

ఇందుకు ముందుగా ఒక బౌల్‌లో షుగర్, లెమన్ జ్యూస్ మ‌రియు తేనె మిక్స్ చేసి ముఖానికి స్ర్కబ్ చేయాలి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం చ‌ర్మానికి చాలా మంది. పంచదారలో ఉండో గ్లైకోలిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది డెడ్ స్కిన్ సెల్స్ మరియు చర్మ దిగువను పేరొకొన్న దుమ్ము మరియు ధూలిని తొలిగించి చర్మాన్ని క్లీన్ గా ఉంచుతంది. చర్మ రంధ్రాలను పూర్తిగా శుభ్రపరిచ మొటిమలను, మచ్చలను పూర్తిగా తొలగిస్తుంది. మ‌రియు పంచదారలో నేచురల్ యాంటీఏజింగ్ గుణాలున్నాయి. షుగర్ స్ర్కబ్ మీ చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: