అందం.. ఏదో క్రిములు పూస్తే వచ్చేది కాదు. అందానికి కూడా విలువ ఉంది. అందుకే ఎవరైతే మంచి ఆహారం తింటారో.. ఎవరైతే ఓసీడీలా ఉంటారో.. వాళ్ళకే అలాంటి అందం సొంతం అవుతుంది. అందుకే మీరు అందంగా ఉండాలి అంటే మీరు కూడా మంచి పోషకాల ఉన్న ఆహారం తీసుకోండి.. మంచి అందాన్ని పొందండి. 

 

కేవలం తినడమే కాదు! మెరిసే చర్మం, ఆరోగ్యవంతమైన శిరోజాలు కావాల్సిన వారికి బొప్పాయి అనే అద్భుతమైన పండు ఉంది. చర్మ సౌందర్య పరిరక్షణకు బొప్పాయి ఎంతో చక్కగా పని చేస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఈ బొప్పాయి పండును అందం కోసం ఉపయోగించండి.. అందంగా మారండి!                           

 

IHG

 

బొప్పాయి గుజ్జు ముఖం, మెడకు రాసుకొంటే అందులోని విటమిన్ ఏ వల్ల చర్మంపై ఉండే మృతకణాలను తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 

 

వెన్న, బొప్పాయి గుజ్జు కలిపి కళ్ల చుట్టూ రాసుకొని అరీనా తర్వాత కడిగితే కంటి కింది నల్లని మచ్చలు, వలయాలు యిట్టె తగ్గిపోతాయి. 

 

బొప్పాయి గుజ్జులో కాస్త తేనే కలిపి మాస్క్ లా వేసుకుంటే ముఖానికి సహజమైన మెరుపు అందుతుంది. 

 

గాయాలు, మొటిమలు, పొక్కుల మూలంగా ఏర్పడిన మచ్చలున్న వారు పచ్చి బొప్పాయి గుజ్జును రాస్తే ఆ మచ్చలు యిట్టె మాయమవుతాయి.

 

అరికాళ్ళ, మడమల పగుళ్లకు బొప్పాయి గుజ్జు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

 

వారంలో 3 రోజులు పాటు బొప్పాయి తినే వారికి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించండి.. అందంగా మారిపోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: