మచ్చ.. మంచిదే అంటారు కానీ ముఖంపై మచ్చలు వస్తే మాత్రం అసలు బాగోవు. మన శరీరంపైన ఏదైనా చిన్న మచ్చ వచ్చిన సరే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరాన్ని బట్టి వైద్యులను అడిగి సలహాలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. పరీక్షల్లో అది ప్రమాదకరం అని తెలిస్తే నిర్లక్ష్యం పక్కనబెట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి అని సూచించారు.                   

 

ఈ మచ్చలు వస్తే ప్రమాదం..!

 

అరచేతులు, అరికాళ్లలో నల్ల మచ్చలు, 3 సెం.మీ కంటే పెద్ద నల్ల మచ్చలు, 50కి మించి ఉండే పుట్టు మచ్చలు, మచ్చలు రంగు మారటం, పెరగటం, మచ్చలు దురద, మంటగ అనిపించటం, మచ్చ దగ్గర ఇన్‌ఫెక్షన్‌ కనిపించటం, 50 ఏళ్లు దాటిన వాళ్లలో పెరిగే మచ్చలు వస్తే వెంటనే వైద్యులను కలిసి చికిత్స చేయించుకోవాలి. 

 

యువతీయువకులు ముఖం మీది మొటిమల్ని గిల్లుకోవటం వల్ల అక్కడ నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని లేజర్‌ ట్రీట్మెంట్‌, కెమికల్‌ పీల్స్‌ సహాయంతో లేకున్నా చేయచ్చు. అలాగే మధుమేహం, థైరాయిడ్‌ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులున్నవారు, ఓరల్‌ పిల్స్‌ వాడేవారిలో ఈ మచ్చలు కనిపిస్తాయి. 

 

మచ్చలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.. 

 

చర్మం మీద మచ్చ వస్తే దాన్ని పొరపాటున కూడా గిల్లకూడదు. గిల్లితే క్యాన్సర్ గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఉపయోగించే ప్రొడక్ట్స్ వల్ల కూడా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాత కాస్మటిక్స్‌ వల్ల ఇబ్బంది లేకపోతే వాటినే వాడటం మంచిది. ఒకవేళ కొత్తది కావాలి అని అనుకున్న సరే ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి. చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవాలి. రోజుకి 6 - 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: