కమల పండు.. శరీరానికి.. ఆరోగ్యానికి ఎంతో మంచి పండు. సీజన్లో దొరికే ఈ కమలాపండు తీపి, పులుపు రుచులతో అందరిని ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ పండు అందంకు ఎంతో ఉపయోగపడుతుంది. చర్మానికి నిగారింపు ఇచ్చే ఈ పండు ఉపయోగాలు ఎన్నో.. అందానికి ఎంత సాయం చేస్తుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి... 

 

చర్మం జిడ్డు పోవాలి అంటే 3 చెంచాల కమలాపండు రసంలో చెంచా చొప్పున ఓట్స్ పొడి, తేనె కలిపి ముద్దగా చేసి ముఖానికి, మెడకు పట్టించి 5 నిమిషాలు మర్దన చేసుకోవాలి.. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జిడ్డు తీవ్రత తగ్గుతుంది. 

 

కంటి కింద నల్లటి వలయాలు తగ్గాలి అంటే పౌష్టికాహారం తీసుకోవడం.. మంచి నిద్ర.. మానసిక ఒత్తిడి లేకుంటే కళ్ళ కింద ఏర్పడే నల్లని వలయాలకు 2 చెంచాల కమలా రసం, అంతే మొత్తం పాలు కలిపి దూదితో రోజూ రాసి కడుగుతుంటే నల్లటి వలయాలు తొలగిపోతాయి. 

 

ఎండబెట్టి పొడి చేసిన కమలా తొక్క పొడితో 2 చెంచాలు తీసుకొని దానికి 2 చెంచాల పాలు, చెంచా మంచి గంధం పొడి కలిపి ముఖానికి పట్టించి ఆరనిచ్చి కడిగితే మృత కణాలు తొలిగిపోయి ముఖ చర్మం కోమలంగా మారుతుంది.                    

 

రంగు తక్కువగా ఉన్నవారు 2 చెంచాల చొప్పున కమలా, నిమ్మరసాలను కలిపి దానికి అరచెంచా తేనె కలిపి ఆ మిశ్రమంతో రోజూ ముఖం, మెడ భాగాలను మర్దనా చేసి ఆరిన తర్వాత కడగాలి.. అంతే మెరిసిపోతారు.        

 

ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును అందంగా మారండి.                    

మరింత సమాచారం తెలుసుకోండి: