నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రిని వివిధ రకాల చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. పొడి చర్మం, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ మొదలైన కొన్ని సమస్యలు మన‌ల్ని చాలా ఇబ్బంది పెడ‌తాయి. దీంతో వాటిని ఎలా త‌గ్గించుకోవాలా అని తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ క్ర‌మంలోనే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నిస్తారు. కాని, ఫ‌లితం ద‌క్క‌దు. వాస్త‌వానికి వీటిలో ఏ ఉత్పత్తి సహజమైనది, సురక్షితమైనది మరియు వ్యయాన్ని తగ్గించేవి కావు. ఆఖరికి ఇవి ఏ సమస్యను సహజాంగా నివారించలేవు. కానీ, ప్ర‌తి ఇంట్లో ఉండే కొబ్బ‌రి నూనెతో ముఖ సౌంద‌ర్యాన్ని అద్భుతంగా పెంచుకోవ‌చ్చు.

 

కొబ్బ‌రి నూనెను చాలా మంది జుట్టుకు రాసుకునేందుకు వాడుతారు. అయితే ఇది చ‌ర్మానికి కూడా ఎంతో చ‌క్క‌గా యూజ్ అవుతుంది. ప్ర‌తి రోజు రాత్రి పూట నిద్రించే ముందు కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మ‌రియు ముఖ కండరాలకు విశ్రాంతి పొంది, రక్తప్రసరణ మెరుగుపడి ముడుతలను మాయం చేస్తుంది. అలాగే చర్మంపై ఉన్న మేకప్‌ను తొలగించే క్రమంలో.. మామూలుగా నీళ్లతో కడిగేస్తుంటారు. కానీ అలా చేసినా కాస్త మేకప్ ఉండిపోతుంది.

 

అందుకే ముందు మేకప్‌ని కొబ్బరి నూనెతో తుడిచేస్తే చాలు ఇట్టే తొలిగిపోతుంది. కొబ్బరి నూనెతో చక్కెరను కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మ‌లినాలు తొలిగి.. ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది. అలాగే కొబ్బ‌రినూనె ఎండ నుంచి మ‌న‌కు సంర‌క్ష‌ణనిస్తుంది. బ‌య‌టికి వెళ్లే ముందు కొద్దిగా కొబ్బ‌రినూనెను ముఖానికి రాసుకుంటే త‌ద్వారా అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి ముఖానికి సంర‌క్ష‌ణ ల‌భిస్తుంది. మ‌రియు కొబ్బరి నూనె, ఆముదం నూనె క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. దీని వ‌ల్ల సాగిన మీ చర్మంలో తప్పనిసరిగా మార్పు కనబడుతుంది. సో.. త‌ప్ప‌కుండా ఈ టిప్స్‌ను ట్రై చేయండి.

 

 
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: