సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో వివిధ రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. డ్రై స్కిన్‌, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ మొదలైన కొన్ని  సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాయని భావించి, మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ప్రోడెక్ట్‌ను యూజ్ చేస్తారు. కానీ, ఫ‌లితం లేక బాధ‌ప‌డ‌తారు. కానీ, ఇలాంటి అసురక్షితమైన ప్రోడెక్ట్స్ వాడ‌డం క‌న్నా.. ఇప్పుడు చెప్పుకోబోయే స‌హ‌జ‌సిద్ధ‌మైన టిప్స్ ఫాలో అయితే ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కైనా చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ లో పెరుగు, శనగ పిండి, తేనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖం పై అప్లై చేసి పావు గంట  తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇది పొడి చర్మం ఉన్న వారికి ఉత్తమమైన ఫేస్ ప్యాక్. ఈ ప్యాక్ చర్మానికి మంచి గ్లోని కూడా అందిస్తుంది. అలాగే  పాలు మ‌రియు తేనెని బాగా కలిపి ముఖం మరియు పిగ్మెంటేషన్ పై రాసి మర్దన చేయండి. పావు గంట త‌ర్వాత‌ చల్లని నీటితో క్లీన్ చేసుకోండి. పాలు చనిపోయిన మృత‌కణాలను తొలగించగలదు. మ‌రియు చ‌ర్మాన్ని కాంతివంతంగా కూడా చేస్తుంది.

 

అదే విధంగా, బొప్పాయి పేస్ట్‌లో తేనెని క‌లిపి ముఖంపై అప్లై చేయండి. అర గంట‌ తరువాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోండి. బొప్పాయి పండులోని అనేక లక్షణాలు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్ కు కారణం అయిన మెలస్మాను తగ్గిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్ర పరుస్తుంది. ఒక పిడికెడు తులసి ఆకులను బాగా నూరి పేస్ట్ చేసుకొని అందులో కొంత పెరుగుని కలిపి ముఖం పై రాయాలి.  పావు గంట‌ తరువాత నీటితో క్లీన్ చేసుకోండి. తులసి చర్మం పై ఉండే మొటిమలను తొలగిస్తుంది. ఇది మొటిమలను కలిగించే బాక్టీరియాతో పోరాడుతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: