చుండ్రు.. ఎంత చిరాకు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రతలు, ఆహారపు అలవాట్ల కారణంగా చుండ్రు సమస్యలు వస్తుంటాయి. ఎంతో ఒత్తైన.. బలమైన జుట్టు ఉన్నప్పటికీ తలలో చుండ్రు చేరింది అంటే జుట్టు బలిహీనం అయిపోతుంది. ఇంకా కొందరి జుట్టు అయితే తీవ్రమైన దురద ఉంటుంది. 

 

ఇంకా అలాంటి దారుణమైన చుండ్రుకు గుడ్ బై చెప్పాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే చుండ్రు తగ్గుతుంది. లేదు అంటే చుండ్రు దారుణంగా పెరిగిపోతుంది. 10 వేప ఆకులు, అరకప్పు పెరుగు, చెంచా నానబెట్టిన మెంతులు, చెంచా నిమ్మరసం కలిపి రుబ్బి నూనెతో కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

 

ఇంకా వారానికి కనీసం 2 రోజులైనా శీకాయ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఒకవేళ ఆ అవకాశం లేనప్పటికీ అరా చెంచా వంటసోడా, 2 చెంచాల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే చుండ్రు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా రెండు చెంచాల మెంతులను పులిసిన పెరుగులో నానబెట్టి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది.

 

కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు మాయం అవుతుంది. కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొబ్బరినూనెను వేడిచేసి అందులో పచ్చి మందారాకులను వేసి మరిగించి దాన్నిరోజూ తలకు పట్టిస్తే చుండ్రు సమస్య అదుపులోకి వస్తుంది. కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగినా చుండ్రు నుండి విముక్తులు అవుతారు. చూశారు కదా! ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు సమస్య ఇట్టే తగ్గిపోతుంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: