అందంగా, ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించాల‌ని ఆర‌ట‌ప‌డ‌ని వారుండ‌రు. అందుకోసం ఏవేవో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా మ‌న చ‌ర్మం ఉంటుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, డ్రై స్కిన్‌, డార్క్ స‌ర్కిల్స్ ఇలా ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు మార్కెట్‌లో ఉన్న అన్ని ప్రోడెక్ట్స్‌ను ఉప‌యోగిస్తుంటారు. కానీ, ఎలాంటి ఫ‌ల‌తం లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అయితే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలో రోజ్ వాట‌ర్ గ్రేట్‌గా ప‌నిచేస్తుంది.

IHG

అన్ని రకాల చర్మ తత్వాలకు రోజ్ వాట‌ర్ ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. రోజ్ వాటర్‌లో వుండే మాయిశ్చరైజింగ్ లక్షణం చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. రోజ్ వాట‌ర్‌లో ముంచి దూదిని కళ్ల కింద తరచూ పెట్టుకుంటే.. కంటి కింద ఉన్న న‌ల్ల‌టి వలయాలు మాయమవుతాయి. అలాగే రోజ్ వాట‌ర్‌లో కొద్దిగా పాలు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. మ‌రియు ముఖం మృదువుగా కూడా మారుతుంది.

IHG

అలాగే పొడి చర్మం గల వాళ్లకు రోజ్‌వాట‌ర్‌లోని సహజమైన నూనెలు.. కావాల్సిన తేమను అందిస్తాయి. అదేవిధంగా, చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు.. తల స్నానం చేశాక ఓ మగ్గు నీటిలో రోజ్ వాటర్ కలిపి మాడుకి తగిలేలా పోసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య త‌గ్గుతుంది. ఇక చర్మంపై సూర్యకిరణాల దుష్ప్రభావాలను నివారించడంలో రోజ్‌వాట‌ర్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే రోజ్‌వాట‌ర్‌లో ఇత‌ర ర‌సాయ‌నాలు ఉండ‌వ‌చ్చు. ఇవి మీ చర్మానికి హానికరం. కాబట్టి మీరు ఇంట్లో గులాబీ రేకుల‌తో.. రోజ్ వాట‌ర్ త‌మారు చేసుకుని ఉప‌యోగించ‌డం ఉత్తమం.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: