నిత్యం కాంతివంతంగా సౌందర్యవంతంగా ఉండడానికి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి.... మంచి ఫలితాలు ఉంటాయి....

రిలాక్సింగ్ బాత్...

ఒక టబ్ గోరు వెచ్చని నీటిలో ముప్పావు కప్పు ఎప్సం సాల్ట్ కలిపి సాల్ట్ కరిగేవరకూ నీటిని తిప్పండి. పావు గంట నుండీ అర గంట వరకూ హాయిగా అందులో రిలాక్స్ కండి.

యాంటీ-డాండ్రఫ్....

జుట్టు ని కొంచెం విడదీస్తూ ఒకటి రెండు టేబుల్ స్పూన్ల సీ సాల్ట్ ని స్కాల్ప్ మీద చల్లండి. తడి వేళ్ళతో స్కాల్ప్ ని పది, పదిహేను నిమిషాల పాటూ జెంటిల్ గా మసాజ్ చేయండి. ఆ తరువాత మీ ఫేవరెట్ ప్రోడక్ట్స్ తో హెయిర్ వాష్ చేసుకోండి. మీకు ఇమ్మీడియెట్ రిజల్ట్స్ కనపడతాయి.

బాడీ స్క్రబ్...

సాల్ట్ నాచురల్ ఎక్స్ఫోలియెంట్. ఇందులో ఉండే మినరల్స్ స్కిన్ ని సాఫ్ట్ గా చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

పావు కప్పు సీ సాల్ట్ లో అర కప్పు ఆలివ్ ఆయిల్ వేయండి. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన, మీ స్కిన్ కి సరిపోయే ఎస్సెన్షియల్ ఆయిల్ పది చుక్కలు కూడా కలుపుకోవచ్చు. దీన్ని స్కిన్ కి అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేయండి. కొంచెం జెంటిల్ గానే చేయండి, లేదంటే సీ సాల్ట్ చర్మం మీద గీరుకున్నట్టుగా అవుతుంది.


ఐ డీ-పఫ్ఫర్...

రెండు కప్పుల గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ సీ సాల్ట్ వేసి కరిగించండి. అందులో కొంచెం కాటన్ ముంచి దాన్ని కంటి చుట్టూతా పెట్టుకుంటే పఫ్ఫీ ఐ ప్రాబ్లం తగ్గుతుంది. ఇది ఐస్ పఫ్ఫీ గా ఉన్నప్పుడే చేయాలి.

ఫేషియల్ టోనర్...

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ సీ సాల్ట్, చిటికెడు ఎప్సం సాల్ట్ వేసి కరిగించండి. స్ప్రే బాటిల్ తో దీన్ని ముఖం మీద స్ప్రే చేసుకుని కాటన్ పాడ్ తో తుడిచేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: