మనలో చాలా మందికి ఎండాకాలం, వర్షాకాలాల కన్నా చలికాలం అంటేనే మక్కువ ఎక్కువ. ఈ కాలంలోనే వరుస పండుగలు, కార్తీక మాసపు వనభోజనాలూ, ధనుర్మాసపు ముంగింటి ముగ్గులూ అన్నీ.. కానీ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే... చలి కాలం మనకి చక్కని కాలమే కానీ చర్మానికి మాత్రం కాదు. ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే చర్మానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కావున క్రింద సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ చలికాలం చక్కిలిగింతల కాలంగా సంతోషంగా గడపవచ్చు.

1. చలికాలం లో వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఉండే మజానే వేరు. కానీ, స్కిన్ కి మాత్రం అంత వేడి నీరు హాని చేస్తుంది. అందుకని గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. అలాగే, స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇందు వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.

2. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రెగ్యులర్ గా నీరు తాగడం మాత్రం మర్చిపోకండి. చల కాలం లో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని బాడీలో ఉన్న నీరు ఆవిరైపోతుంది. ఇంట్లో హ్యుమిడిఫయర్ ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కొంత వరకూ ఈ సమస్యని అధిగమించవచ్చు.

3. సమ్మర్ లో స్కిన్ కి సరిపోయే ప్రోడక్ట్స్ వింటర్ లో సరిపడవు. వింటర్ లో స్కిన్ హెల్దీగా గ్లోయీ గా ఉండాలంటే ఒకటే మార్గం, మైల్డ్ ప్రోడక్ట్స్ ని ఎంచుకోవడం. మాయిశ్చరైజర్స్ ఉన్న క్లెన్సర్స్ ని ఎంచుకోండి. ఆల్కహాల్ ఉన్న మాస్క్స్, పీల్స్, ఆస్ట్రిజెంట్ లోషన్స్, ఇంకా ఇతర స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పూర్తిగా ఎవాయిడ్ చేయండి.

4. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ మర్చిపోకండి. గ్లోవ్స్, క్యాప్స్ యూజ్ చేయండి. వెచ్చని సూర్య కిరణాలు బావుంటాయి కానీ వాటిలో ఉన్న యూవీ రేస్ స్కిన్ కి హాని చేస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు అవసరం.

5. డెడ్ స్కిన్ సెల్స్ ని ఎక్స్ఫోలియేషన్ ద్వారా రిమూవ్ చేస్తాం. కానీ, వింటర్ స్కిన్ ఆల్రడీ కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది. అందుకని, వారానికి ఒక్క సారి కంటే ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయకండి. ఎక్స్ఫోలియేషన్ కూడా మీ స్కిన్ టైప్ ని బట్టి జరగాలి. మీది కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అయితే వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేయండి. డ్రై స్కిన్ ఉంటే చాలా లైట్ గా ఎక్స్ఫోలియేట్ చేయాలి.

6. శరీరం లో మిగిలిన భాగాల కంటే చేతుల మీద ఆయిల్ గ్లాండ్స్ తక్కువగా ఉంటాయి. అందుకనే, చేతుల ద్వారా మాయిశ్చర్ ఎస్కేప్ అయిపోతుంది. అందుకనే, బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ కి కూడా తప్పని సరిగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

7. గ్లిసరిన్ బేస్డ్ క్రీంస్, పెట్రోలియం జెల్లీ మీ పాదాలని మాయిశ్చరైజ్ చేస్తాయి. అలాగే, పాదాల మీద స్కిన్ ని కూడా అప్పుడప్పుడూ ఎక్స్ఫోలియేట్ చేయాలి. అప్పుడే మాయిశ్చరైజర్ ఈజీగా అబ్జార్బ్ అవుతుంది.

8. మీకు పడని వాటి విషయం లో చలికాలం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ చాలా టెండర్ గా ఉండడం వల్ల త్వరగా ఎఫెక్ట్ అవుతుంది.

9. సన్ స్క్రీన్ ఎంత అవసరమో సన్ గ్లాసెస్ కూడా అంతే అవసరం. సన్ రేస్ కళ్ళ చుట్టూతా ఫైన్ లైన్స్ ఏర్పడడానికీ, బ్రౌన్ స్పాట్స్ కి కారణం అవుతాయి. యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ ధరించడం వల్ల ఈ సమస్య రాకుండా చూడవచ్చు.

10. డైలీ స్కిన్ కేర్ రొటీన్ ని తప్పని సరిగా ఫాలో అవ్వండి. రోజుకి రెండు సార్లు, పొద్దున్నా, రాత్రి నిద్రకి ముందూ క్లెన్సింగ్ చేయండి. పొద్దున్న ఫేస్ వాష్ తరువాత లైట్ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. రాత్రి ఓవర్ నైట్ క్రీం కానీ, హెవీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయండి. స్కిన్ ఇంకా తడిగా ఉన్నప్పుడే ఇలా చేయండి.

11. ఈ సీజన్ లో దొరికే పండ్లూ కూరగాయలూ తీసుకోండి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, బ్లూ బెరీస్, చెర్రీస్, మీకు నచ్చినవి తినండి. సూప్స్, సలాడ్స్, జ్యూసెస్, గోరు వెచ్చని పాలు కూడా ఈ సీజన్ లో బావుంటాయి.

12. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. చలికాలం లో పొద్దు పొద్దున్నే వెచ్చని దుప్పటి లో నుండి బయటకు రావడం కష్టమే, కానీ మీకు మీ స్కిన్ అంటే ప్రేమ ఉంటే మాత్రం ఇది తప్పదు. ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది, ఫలితంగా బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: