ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వానాకాలం పోయి చలి కాలం వచ్చింది. ఇంకేముంది మన లిప్స్ పొడిబారిపోతాయి. కొంతమంది లిప్ బామ్స్ వాడుతుంటారు మరికొందరు లిప్ సిరాప్స్ ని వాడుతుంటారు. కాని లిప్ బామ్స్ కంటే లిప్ సిరాప్స్ యే చాలా మంచిది. ఇక ఈ రెండింటికి తేడాలు ఏంటో చూసినట్లయితే... లిప్ బామ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. సీరం మీ లిప్ సమస్యలను టార్గెట్ చేస్తే బామ్ మాయిశ్చర్‌ను లాక్ చేస్తుంది. లిప్స్ లోపల సెబేకియస్ గ్లాండ్స్ అసలు ఉండవు. దీనివల్ల లోపల నుంచి ఎలాంటి నేచురల్ ఆయిల్స్ ఉత్పత్తి కావు. దీని వల్ల పెదాలు త్వరగా పొడిబారిపోతాయి. లిప్ బామ్స్ మాయిశ్చరైజ్ చేస్తాయి. కానీ, అవి కూడా వెంటనే డ్రై అయిపోతాయి. మాటి మాటికీ వాటిని పెదాలకు అప్లై చేస్తుండాలి. లిప్ సీరమ్స్ అలా కాదు, అవి లాంగ్ టెర్మ్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఎందుకంటే, లిప్ బామ్ పైపైనే ప్రొటెక్షన్ ఇస్తుంది. లిప్ సీరమ్ లోపలి నుంచి సమస్యను పరిష్కరిస్తుంది. అంతేగాక సీరమ్స్ ఫైన్ లైన్స్‌‌ను తగ్గిస్తాయి.

లిప్ సిరప్ ని ఇంట్లోనే ఈజీ గా ఇలా తయారు చేసుకోవచ్చు...

ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ పసుపు. ఈ రెండింటినీ బాగా కలిపి రోల్-ఆన్-నాజిల్ ఉన్న ఒక చిన్న బాటిల్‌లో వేయండి. రాత్రి నిద్రకి ముందు ఈ సీరమ్ అప్లై చేయండి. పొద్దున్న ఫేస్ వాష్ చేసుకున్నాక కూడా మీకు కావాలనుకుంటే అప్లై చేయవచ్చు. కానీ, ఇది చాలా థిక్‌గా ఉంటుంది. ఇందులోని పసుపు లిప్స్‌ను మళ్ళీ సరైన రంగులోకి లోకి తెచ్చేస్తాయి. నెయ్యి చలి కాలంలో కావాల్సిన పోషణ అందిస్తుంది. లిప్స్ స్క్రబ్ చేసుకున్న వెంటనే ఈ సీరమ్ అప్లై చేయడం ఇంకా మంచిది.

మీద చర్మంతో పోల్చితే పెదవుల మీద స్కిన్ పలచగా ఉంటుంది. అందుకని లిప్స్ డ్రై అయిపోకుండా లిప్ బామ్ రక్షిస్తుంది.

లిప్ బామ్ లేదా లిప్ సిరప్  వాడడం వల్ల లిప్స్ యూత్‌ఫుల్‌గా కనపడతాయి.

ఎస్‌పీఎఫ్ ఉన్న లిప్ బామ్స్ లేదా లిప్ సిరాప్స్ సన్‌ రేస్ నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....


మరింత సమాచారం తెలుసుకోండి: