చాలా మంది పెదాలు నల్లగా పొడి బారిపోయి ఉంటాయి. అలా పొడిబారకుండా ఎర్రటి పెదాలు కోసం ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎర్రటి పండ్లను ఎక్కువగా తీసుకొండి. దానిమ్మ, బీట్ రూట్ అలాగే క్యారెట్స్ ను తీసుకోండి. వీటిలో ముఖ్యమైన విటమిన్స్ అలాగే మినరల్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతాయి.బీట్ రూట్ పేస్ట్ అలాగే క్యారట్ పల్ప్ ను కూడా లిప్స్ పై అప్లై చేయవచ్చు. డార్క్ స్పాట్స్ అలాగే డిస్కలరేషన్ ను ఇవి తగ్గిస్తాయి. పెదాలు హెల్తీగా అలాగే రెడ్ కలర్ లో కనిపించేందుకు హెల్ప్ చేస్తాయి. బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుని నిమ్మ అలాగే షుగర్ ను కలిపి ఈ మిశ్రమంతో లిప్స్ ను స్క్రబ్ చేసుకోవచ్చు.కొంత బీట్రూట్ అలాగే క్యారెట్స్ ను తీసుకుని వాటిని చాప్ చేసి బ్లెండర్ లో వేయాలి. కొంత నీటిని కలిపి ప్యూరీ తయారుచేసుకోవాలి.


ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ తేనెను అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ ను కలపాలి. దీన్ని పెదాలకు ఉదయాన్నే ఒఇకసారి రాత్రి ఒకసారి అప్లై చేయాలి. సహజసిద్ధమైన రెడ్ ఫ్రూట్స్ ను వాడండి. వాటిని లిప్స్ పై రబ్ చేస్తే కొంత కలర్ నేచురల్ గా సంతరించుకుంటుంది. ఆ తరువాత వెంటనే లిప్ బామ్ ను అప్లై చేయండి.నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు  సమృద్ధిగా ఉంటాయి.ఇది నల్లటి పెదాలపై అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం అలాగే షుగర్ ను కలిపి స్క్రబ్ ను తయారుచేయండి. దీంతో పెదాలను ప్రతి రోజు మార్చి రోజు స్క్రబ్ చేయండి. నిమ్మరసాన్ని ఎక్కువగా అప్లై చేస్తే లిప్స్ డ్రై అయిపోతాయి. మీకు అలా జరుగుతుందని అనిపిస్తే గ్లిజరిన్ లేదా తేనెను మిక్స్ చేయండి.కొంత రోజ్ వాటర్ ను, తేనెను అలాగే సాఫ్రాన్ను తీసుకోండి.


రోజ్ వాటర్ లేదంటే కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకుని వాటిని నీటిలో గంటపాటు నానబెట్టి వాటిని పేస్ట్ చేయండి. ఆ తరువాత అందులో కాస్తంత తేనెతో పాటు కొన్ని సాఫ్రాన్ త్రెడ్స్ ను కలపండి. దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేయండి. మీ లిప్స్ మళ్ళీ రంగును తెచ్చుకుంటాయి.ఈ టిప్స్ ను పాటిస్తే అందమైన పెదాలు మీ సొంతమవుతాయి.ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: