ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ముఖ సౌందర్యం కోసం మనం ఎన్నో రకాలుగా తిప్పలు పడతాం. వాటికోసం ఆ క్రీములు ఈ క్రీములు రాసి ముఖాన్ని పాడు చేసుకుంటాం. కాని పసుపుతో ఈ పద్ధతులు రోజు పాటిస్తే అద్భుతమైన అందం ఇక మీ సొంతం అవుతుంది...సగం టీస్పూన్ పసుపు పొడి సగం టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో బాగా  కలపండి. ఇప్పుడు, అర టేబుల్ స్పూన్ పాలు లేదా పెరుగును కలిపే ముందు మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ ముడి తేనె కలపండి. అదనపు పంచ్ కోసం, ఒక డ్రాప్ నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్ లేదా తాజా నిమ్మరసం జోడించండి.


మీ ముఖం ఇంకా మెడ అంతటికీ ఈ  మిశ్రమాన్ని అప్లై చెయ్యండి. ఇంకా అలాగే ఒక పావుగంట పాటు  గోరువెచ్చని నీటితో కడగాలి.అలాగే మీరు వాడే మాయిశ్చరైజర్‌కు కొద్దిగా పసుపు పొడి వేసి, ప్రతిరోజూ వాడండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నందు వలన అది  మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే  చర్మాన్ని చాలా మృదువుగా ఉంచుతుంది.పెదాలు పగిలినప్పుడు వాసెలిన్‌కు చిటికెడు పసుపుని కలపండి. ఈ మిశ్రమాన్ని రోజూ మీ పెదాలకి రాసుకోవడం వలన మీ పెదాలు ముఖ్యంగా ఈ  శీతాకాలంలో  చాలా మృదువుగా వుంటాయి.


వాతావరణం కారణంగా మీ పెదవులు అధికంగా పొడిగా  పగిలినప్పుడు ఇలా ట్రై చెయ్యండి.అలాగే పసుపుని నూనెతో కలిపి కళ్ల కింద రాసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కాని మచ్చలు కాని తగ్గిపోతాయి.ముడి తేనెను పసుపు పొడితో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం పై అప్లై చేసుకొని ఒక పది నుంచి ఇరవై నిముషాలు దాకా ఉంచుకొని ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మొటిమలు, మచ్చలు ఉంటే ఖచ్చితంగా తొలిగిపోతాయి..ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సౌందర్య చిట్కాలు గురించి తెలుసుకోండి...



మరింత సమాచారం తెలుసుకోండి: