ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ముఖం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండటానికి వారానికి ఒకసారి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి.. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి...కొంచెం తేనె, కొద్దిగా గ్రీన్ టీ తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి పది నుండి పదిహేను నిమిషాలు అలా వదిలేయండి. వారానికి ఒకసారి ఈ  ఫేస్ మాస్క్ వాడడం వల్ల స్కిన్ చాలా బాగుటుంది. చర్మం లోపలి నుండి మురికీ, బ్యాక్టీరియా తీసేయడం ద్వారా చర్మానికి లోపలి నుండి కాంతినిస్తుంది. పోర్స్ బాగా క్లీన్ అయిపోవడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా  కనపడుతుంది.


రోజూ ఫాలో అయ్యే క్లెన్సింగ్ రొటీన్ చర్మ రంధ్రాల లోపల ఇరుక్కుపోయి ఉన్న మలినాలను బయటకు లాగలేదు. అలాగే మొటిమలతో బాధ పడేవారికి కూడా ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వలన పింపుల్స్,  నల్లటి మచ్చలు తగ్గి చర్మం తల తల మెరిసిపోతుంది. వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన చర్మానికి చాలా ప్రశాంతత లభిస్తుంది. వారానికి ఒకసారయినా ఫేస్ మాస్క్ వాడితే  క్లీన్ గా ప్రశాంతంగా ఉంటుంది.


ఈ ప్రక్రియ వల్ల చర్మానికి మంచి గ్లో వస్తుంది.ఫేస్ మాస్క్ ని తీసేసేటప్పుడు చేసే స్క్రబ్బింగ్ వల్ల ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ  పెరుగుతుంది. ఫలితంగా చర్మాని కి అవసరమైన న్యూట్రిషన్ అందుతుంది. అందుకే, ఫేస్ మాస్క్ తీసి వేసిన  తరువాత చర్మం  అంత సాఫ్ట్ గా, స్మూత్ గా, మెరుస్తూ ఉంటుంది. అలాగే మంచి నీళ్లు ఎక్కువగా త్రాగండి. రోజు మంచి నీళ్లు తాగడం చదవడం వలన చర్మం చాలా కాంతి వంతంగా ఉంటుంది.


ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకండి. ఇవి స్కిన్ కి కావాల్సిన పోషకాలని అందివ్వలేవు. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బలహీన పరుస్తాయి. ఫలితంగా స్కిన్ మరీ డ్రై గా కానీ, మరీ ఆయిలీ గా కానీ తయారవుతుంది. ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. ఒక రోజో రెండు రోజులో అయితే పరవాలేదు కానీ, రెగ్యులర్ గా సరిపడినంత నిద్ర లేకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ ముందు స్కిన్ మీదే పడుతుంది..ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: