ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ముఖం అందంగా ఉండడంలో కళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ కళ్లు అందంగా ఉండాలంటే మన ఐబ్రోస్ కూడా అందంగా ఉండాలి. ఇక ఐబ్రోస్ అందంగా ఉండటానికి ఈ టిప్స్ ని పాటించండి.. సాధారణంగా ఐబ్రోస్ నీట్ గా ఉండటానికి ట్రిమ్ చేస్తుంటాము. అలా ఐబ్రోస్ ని ట్రిమ్ చేయడం వల్ల వాటి షేప్ ని రిటెయిన్ చేయగలుగుతారు. కానీ ఇలా చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర స్పూలీ బ్రష్, కొన్ని స్ట్రెయిట్ సిజర్స్ ఉండాలి. ఐబ్రో హెయిర్ అంతా పైకి దువ్వి ఈ ఐబ్రో షేప్ కన్నా పైకి ఉన్న హెయిర్స్ ని ట్రిమ్ చేయండి. చిన్న చిన్న స్నిప్స్ తోనే ట్రిమ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద స్నిప్స్ ట్రై చేయకండి.ఐలైనర్ పెన్సిల్ ని మీ ఎడమ ముక్కు దగ్గర పెట్టి పెన్సిల్ పై భాగం ఎక్కడ టచ్ చేస్తుందో అక్కడ మార్క్ చేయండి.

కుడి వైపు కూడా ఇలాగే చేయండి. మీరు ఐబ్రోస్ మధ్యలో ప్లక్ చేయాలనుకుంటే ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న స్పేస్ లోనే చేయాలి. ఇంతకంటే ఎక్కువగా చేస్తే రెండు ఐబ్రోస్ మధ్యా గ్యాప్ ఎక్కువైపోతుంది.ఐబ్రోస్ పై భాగం లో ఎప్పుడూ ట్వీజ్ చేయకండి. అలా చేస్తే మీ బ్రో షేప్ మొత్తం పోతుంది. మీ బ్రోస్ ని మంచిగా బ్రష్ చేసి వాటి నాచురల్ షేప్ నుండి వేరేగా పెరుగుతున్న హెయిర్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. అలా ఏవైనా ఉంటే వాటిని మాత్రం ప్లక్ చేయండి, మిగిలిన వాటిని తాకను కూడా తాకకండి.ఒక్క రోజులోనే మీ బ్రోస్ మొత్తం వర్క్ చేసేయడానికి ట్రై చేయకండి. మీ ఐబ్రో ఎపాయింట్మెంట్స్ మధ్యలో అసలు మీ బ్రోస్ ని మీరు టచ్ చేయకూడదు అన్నది రూల్.

కానీ, అవసరం వస్తే ఒక రోజులో కొన్ని హెయిర్స్ మాత్రమే ట్వీజ్ చేయండి. ఒక్కసారే అన్నీ చేసేయాలని అనుకోకండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రొఫెషనల్ గా చేయించుకున్న ఐబ్రోస్ యొక్క షేప్ కి మీరు స్టిక్ అయి ఉంటారు.మీరు ఐబ్రోస్ ట్వీజ్ చేసేప్పుడు తప్పనిసరిగా మీరు ఒక మ్యాగ్నిఫైయింగ్ మిర్రర్ ని యూజ్ చేయాలి. ఇంకో పెద్ద మిర్రర్ లో మీ ప్రోగ్రెస్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇందువల్ల ఐబ్రోస్ సరిగ్గా గ్రూమ్ చేసుకోగలుగుతారు. అయితే, ఈ పని ఎప్పుడూ హడావిడిగా చేయకండి. చేతిలో తగినంత సమయం ఉన్నప్పుడే ఈ పని పెట్టుకోండి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: