ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...చలికాలంలో చాలామంది బరువు పెరుగుతారని, ఇందుకు సూర్యరశ్మి తక్కువగా ఉండటమే కారణమని పరిశోధకులు తెలిపారు. వేసవితో పోల్చితే చలికాలంలో యూవీ కిరణాల ప్రభావం తక్కువగా ఉంటుందని, దీనివల్ల విటమిన్-డి కూడా తక్కువగానే అందుతుందని పేర్కొన్నారు. వేసవిలో విటమిన్-డి చాలా సులభంగా లభిస్తుందని, చలికాలంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడం వల్ల తగినన్ని పోషకాలు లభించవని తెలిపారు.విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేయొచ్చని పేర్కొన్నారు. పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, బెండకాయలు తదితర ఆహారాల ద్వారా విటమిన్-డిని పొందవచ్చు.

సూర్య రశ్మి శరీరానికి విటమిన్-D లభిస్తుందనే సంగతి తెలిసిందే. అలాగే, కొన్నిరకాల ఆహారాల్లో కూడా విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్-డి ద్వారా శరీరంలోని కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాలు తాకగానే ఈ ప్రక్రియ మొదలవుతుందని స్టడీలో పేర్కొన్నారు. కొవ్వు కణాల తరుగుదల వల్ల క్రమేనా బరువు కూడా తగ్గుతారు.తాజా  అధ్యయనంలో ఎంత సేపు సూర్యరశ్మిలో ఉంటే శరీరంలో కొవ్వులు కరుగుతాయనే విషయాన్ని స్పష్టం చేయలేదు. సాధారణంగా వేసవిలో 10 నుంచి 15 నిమిషాలు ఎండలో నిలుచుంటే చాలని చెబుతారు.

అయితే, చలికాలంలో మాత్రం సుమారు 1 గంట నుంచి 2 గంటలు నిలుచుంటే శరీరానికి అవసరమైన విటమిన్-డి లభిస్తుందని అంచనా. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలు, మధ్యాహ్నాం ఒక గంట నుంచి 3 గంటల్లో లభించే ఎండ విటమిన్-డి పొందేందుకు మంచిదని సూచిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: