అమ్మాయిలు అందం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది పాత చిట్కాలను పాటిస్తే, మరి కొంత మంది ఇంటర్నెట్ లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. కొంతమంది ఈ చిట్కాలను పాటింస్తుంటే,మరి కొంతమంది  ఇక సమయం లేక మార్కెట్లో దొరికే షీట్ మాస్క్ ను ఉపయోగిస్తున్నారు.  అయితే ఈ షీట్ మాస్క్  మన చర్మానికి ఏ విధంగా సహాయపడుతుందనేది  మాత్రం,ఎవరికీ తెలియదు. ఈ షీట్ మాస్క్ ఇన్స్టంట్ అయినప్పటికీ 1 - 2 రోజులకు మాత్రమే చర్మానికి బ్రైట్నెస్ ను అందిస్తుంది.  కానీ దీని వల్ల కలిగే నష్టాలు మాత్రం చాలా మందికి తెలియదు.  ఈ షీట్ మాస్క్  ఉపయోగించే వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకుంటే,ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు అని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


ప్రస్తుతం ఫేషియల్స్ స్థానంలో ఈ షీట్ మాస్క్ ట్రెండ్ నడుస్తోంది. చర్మం మీద నలుపు పోగొట్టాలన్నా, ముడతలు తగ్గించాలన్నా , చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చాలన్నా, ఎలా అనుకుంటే అలా అన్ని రకాలలో ఈ షీట్ మాస్క్ లు  మనకు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఈ షీట్ మాస్క్ ను  జపాన్,కొరియన్ దేశస్తులు తయారు చేశారు. ఇక అక్కడి వాళ్ళు  కరోనా కాలంలో బయటికి  వెళ్లలేక ఎంతోమంది ఇళ్ళల్లోనే  ఈ షీట్ మాస్క్ ను  వేసుకుంటున్నారు. మనదేశంలో కూడా వీటికి గిరాకీ బాగానే పెరిగింది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ముఖం పై మెరుపు వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు,టీవీ చూస్తున్నప్పుడు ఇలా ఏ పనులు చేస్తున్నప్పటికీ, చకచకా ఈ మాస్క్ వేసుకొని వారి వారి పనులు చేసుకుంటున్నారు.


మాస్క్ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు, తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఈ షీట్ మాస్క్  ముఖానికి వేసుకోవాలి అనుకున్నప్పుడు, ముందుగా మంచి నీళ్ళతో శుభ్రపరుచుకుని ఆ తరువాత  క్లెన్సింగ్  మిల్క్ తో మరోసారి క్లీన్ చేయాలి. తర్వాత ఈ షీట్ మాస్క్  వేసుకోవడం మంచిది. షీట్ మాస్క్  తీసేసిన తర్వాత మాయిశ్చరైజర్ ను వాడితే మంచిది.  షీట్ మాస్క్ వేసుకున్నప్పుడు ముఖాన్ని కదిలించకుండా ఉండాలి.


అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ షీట్ మాస్క్ ను వేసుకుంటే మాత్రం ముఖం పై దురద, మంట, అలర్జీ వంటివి  వచ్చే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: