చర్మాన్ని ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేయడం వలన ఎన్నో చర్మసంరక్షణ ప్రయోజనాలను పొందవచ్చు. లేదంటే, చర్మం డ్రైగా మారిపోతుంది. అలాగే, చర్మంపై ఇంకొన్ని దుష్ప్రభావాలు కూడా పడే ప్రమాదం ఉంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ముడతలు:

స్కిన్ కేర్ రొటీన్ లో మాయిశ్చరైజర్ కున్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. మాయిశ్చరైజర్ ను వాడకపోతే చర్మంపై ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్కిన్ ప్రొటెక్షన్ లేయర్ అనేది కాంప్రమైజ్ అయినప్పుడు స్కిన్ డ్రైగా మారిపోతుంది. ఆల్రెడీ ఉన్న ముడతలు మరింత హైలైట్ అవుతాయి. డిహైడ్రేటెడ్ స్కిన్ అనేది అన్నిటికీ కారణం. ముడతలు ఎక్కువగా హైలైట్ కాకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్ తప్పనిసరని గుర్తించండి.

2. కాంప్లెక్షన్:

మాయిశ్చరైజర్ ను వాడకపోతే స్కిన్ అనేది డల్ గా అలాగే ఫ్లేకీగా కనిపిస్తుంది. ముఖ్యంగా బయటి వాతావరణం చల్లగా ఉన్నపుడు ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. శీతాకాలంలో గాలిలో తేమశాతం తగ్గుతుంది. దాంతో, పొడిగాలి అనేది చర్మాన్ని డిహైడ్రేట్ చేస్తుంది.

3. మొటిమలు:

స్కిన్ డ్రైనెస్ అనేది మొటిమల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది అనంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. బాగా గ్రీజీగా కనిపిస్తామని మీరు అనుకుంటే మీ అవసరాలకు తగిన మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకోమని వారు సూచిస్తున్నారు. మొటిమల సమస్య బారిన పడే రిస్క్ ఉన్నటువంటి స్కిన్ టైప్ కలిగిన వారు అయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను వాడితే మంచిదని వారు సలహా ఇస్తున్నారు.

4. మేకప్ :

మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకుంటేనే మేకప్ లుక్ అనేది సరిగ్గా హైలైట్ అవుతుంది. లేదంటే, మేకప్ మీ లుక్ ను ఎలివేట్ చేయదు సరికదా, మీ లుక్ ను మరింత డిస్టర్బ్ చేస్తుంది. డ్రై ఏరియాస్ పై మేకప్ వేస్తే మేకప్ అక్కడ స్టిక్ అయిపోతుందని అలాగే ఫైన్ లైన్స్ గా ఏర్పడే సమస్య తలెత్తవచ్చని వారంటున్నారు. బెస్ట్ రిజల్ట్స్ కోసం మాయిశ్చరైజర్ లేదా ప్రైమర్ ను అప్లై చేసుకున్న ఐదు నిమిషాల తరువాత మేకప్ ను అప్లై చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: