వాతావరణంలో మార్పులను బట్టి మనం బ్యూటీ ప్రోడక్ట్స్ ను ఎంచుకోవాలి. ఏ సీజన్ కి సూటయ్యే బ్యూటీ ప్రోడక్ట్స్ ను ఆ సీజన్ లో వాడుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ ను పొందవచ్చు. చల్లటి వాతావరణం నుంచి వెచ్చటి వాతావరణంలోకి మారేటప్పుడు గాలిలోని తేమశాతం పెరుగుతుంది. టెంపరేచర్ లో వేడి అనేది చర్మాన్ని ఆయిలీగా అలాగే గ్రీజీగా మారుస్తుంది.


ఎండాకాలంలో చర్మం అనేది ఎండతో పాటు క్లోరిన్ అలాగే ఉప్పునీటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఈ డేమేజ్ నుంచి చర్మం రికవరి అవడం ఎంతో ముఖ్యం. ఈ సమయంలో చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోవడం ముఖ్యం. చర్మం మరింత ఆరోగ్యంగా మారడం ముఖ్యం. ఎక్స్ఫోలియేషన్ తో పాటు చర్మాన్ని హెల్తీగా ఉంచుకోవాలి. కాబట్టి, డైలీ రొటీన్ లో వాటర్ బేస్డ్ క్లీన్సర్స్ ను అలాగే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ను వాడటం ముఖ్యం. హైడ్రేటింగ్ సెరమ్ ను ఎల్లప్పుడూ వద్ద ఉంచుకోవాలి. 


చలికాలంలో స్కిన్ కేర్ విషయంలో శ్రద్ధ ఒక విధంగా ఉంటే ఎండాకాలానికి స్కిన్ కేర్ విషయంలోని శ్రద్ధలో మార్పులూ చేర్పులూ అవసరం. బేసిక్ రూల్ 'క్లీన్స్ అలాగే మాయిశ్చర్' అనేది మారకుండా అలాగే ఉంటుంది. 


మాన్సూన్ లో ప్రత్యేకమైన స్కిన్ కేర్ రొటీన్ అవసరపడుతుంది. ఎందుకంటే, ఈ సమయంలో హీట్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో స్కిన్ ఆయిలీగా మారుతుంది. బ్రేకవుట్స్ వస్తాయి. దీన్ని అధిగమించాలంటే, ఇప్పుడు చెప్పబోయే పద్దతులను ఫాలో అవ్వాలి. 


చర్మ రంధ్రాలను శుభ్రపరచడానికి జెంటిల్ ఎక్స్ఫోలియేషన్ తప్పనిసరి అవుతుంది. అలాగే, క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ను వాడటం మానేసి నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్ ను ఎంచుకోండి. అలాగే, మంచి టోనర్ ను వాడండి. దాంతో, స్కిన్ లోని డస్ట్ పార్టికల్స్ అనేవి తొలగిపోతాయి. బ్రేకవుట్స్ ను నిరోధించవచ్చు. 

హైడ్రేటింగ్ ఫేస్ మాస్కులు కూడా మంచివే. ఇవి చర్మాన్ని చల్లబరచడంతో పాటు ఇన్స్టెంట్ గా న్యూట్రియెంట్స్ ను అందిస్తాయి. అలాగే కోల్పోయిన హైడ్రేషన్ ను తిరిగి తెస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: