స్కిన మెరిసి పోవడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ఎన్ని వాడినా చర్మం కాంతిహీనంగా ఉంటుంది.చర్మ సంరక్షణ కోసం ఉత్పత్తులను వాడేటప్పుడు అవి ఎలాంటివో మన శరీరానికి సరిపోతాయా లేదో చూసుకోవాలి.కొన్ని ఉత్పత్తులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి.కాబట్టి మన శరీరానికి సరిపోయే ఉత్పత్తులను మాత్రమే వాడాలి.చలికాలంలో శరీరం పొడిబారుతుంది. దీనికి సరిపోయే క్రీములు రాసుకోవాలి.

 చర్మం ఆరోగ్యంగా ఉండడం కోసం:
 చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు అధికంగా ఉండే పండ్లు తినాలి.నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి.మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం,ఒత్తిడిని తగ్గించుకోవడం,వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.ఇంకా ధ్యానం,వ్యాయామం చేయడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ చేయాలి.వయసు పెరిగే కొద్దీ చర్మ సమస్యలు చాలా వస్తాయి.వీటికి తగిన వాటిని ఉపయోగించి చర్మాన్ని సంరక్షించుకోవాలి.

 చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా ఉండే పండ్లు,కూరగాయలు తినాలి.ఎందుకంటే చర్మం లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచుతాయి శరీరానికి నీరు బాగా అందాలంటే ఆపిల్, కీర దోసకాయలు,ద్రాక్ష ఎక్కువగా తీసుకోవాలి.ఇంకా పుచ్చకాయ లో కూడా పేరు అధికంగా ఉంటుంది.వీటన్నింటినీ వాడడం వల్ల సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

 చర్మం కాపాడుకోవడానికి పాటించవలసిన దినచర్యలు మర్చిపోకుండా రాత్రిపూట చర్మ సంరక్షణ కోసం వాడే ఉత్పత్తులు అప్లై చేయాలి.ఎందుకంటే రాత్రి వాడడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

 ఎలక్ట్రానిక్స్ నీ ఎక్కువ సేపు ఉపయోగించకూడదు వాటిని ఉపయోగించేటప్పుడు వాటినుండి వెలువడే నీలి రంగు లైట్ చర్మంపై పడకుండా అద్దాలను వాడడం మంచిది.పర్యావరణ సమస్యల వల్ల చర్మానికి కలిగే నష్టాలను ఎదుర్కొనే ఉత్పత్తులనే వాడాలి.

 చర్మ సంరక్షణ కోసం వాడే ఉత్పత్తులను రొటీన్గా వాడండి. చర్మానికి సరిపోయే పాల గురించి తెలుసుకుందాం..

1. మొటిమలు రాకుండా ఉండడానికి సాలిసిలిక్ యాసిడ్ క్లింజర్ తో ట్రీట్మెంట్ చేసుకోవాలి.
2. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను పోగొట్టుకోవడానికి విటమిన్ సి వాడాలి.
3. రెటినోల్, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉపయోగించడం వల్ల చర్మం కాంతి హీనం కాకుండా ఉంటుంది.
4. విటమిన్ సి కెఫీన్ ఉపయోగించి కంటి కింద వలయాలు రాకుండా చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: