చీర కట్టడం అనేది హిందూ సాంప్రదాయం. చీర కట్టు అందాలు  అమ్మాయి అందానికి వన్నె తెస్తాయి.. అలాంటి చీరలు కట్టేటప్పుడు కూడా మగువలు చాలా జాగ్రత్త వహిస్తారు. అయితే  కేవలం ఖరీదైన చీరలు కడితే మాత్రం సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి మనం చీర కట్టుకున్నప్పుడు ఎలాంటి మేకప్ వేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఐ లైనర్ :
అందం రెట్టింపు అవ్వాలంటే మాత్రం కళ్ళ అందం కూడా బాగుండాలి. అందుకోసం అందంగా, క్లాసిక్ గా కనిపించాలంటే మాత్రం తప్పకుండా ఐ లైనర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు కంటి ఎగువ, దిగువ కనురెప్పలను ఐ లైనర్ లేదా కాజల్ తో అలంకరించుకోవచ్చు. ఒకవేళ మీ కళ్ళు స్పష్టంగా, మృదువుగా కనిపించాలంటే ఐ లైనర్ ని ఉపయోగించండి. లేదా మీ కళ్ళు కొంచెం పెద్దవిగా కనిపించాలంటే కాజల్ ను ఉపయోగించడం మంచిది..

రెట్రో లుక్ :
ఈ రెట్రో లుక్ లో అమ్మాయి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇందుకోసం మీరు కళ్ళకు కంటి సిరాను ఈక లా గీయడం ద్వారా మీ రూపాన్ని సాధించవచ్చు. ఇందుకోసం మీరు ముదురు ఎరుపు రంగు కల లిప్ స్టిక్ ను ఉపయోగించడం వల్ల బుగ్గలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీరు మీ పెదాలకు వాడే ఈ లిప్ స్టిక్ మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

ఆయిల్ మేకప్ :
వేసవి కాలంలో ఆయిల్ మేకప్ వేసుకోవడం ఎంతో మంచి ఎంపిక. అధిక ఎంబ్రాయిడరీ కలిగిన చీరను, ఆభరణాలను ధరించినపుడు ఈ మేకప్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇలా చేయడం వల్ల అందరిలో స్పెషల్ గా కనిపించడం మొదలవుతుంది.

కళ్ళకు స్మోకీ మేకప్ :
కళ్ళ పై స్మోకి మేకప్ పెడితే చీర మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

 ఎరుపు రంగు చీర:
ఈ ఎరుపు రంగు చీర ఎప్పుడూ క్లాసిక్ లక్ ను ఇస్తుంది. స్త్రీలు లేత రంగులో ఉన్నప్పటికీ, ముదురు రంగులో ఉన్నప్పటికీ ఎరుపు చీర అందరికీ బాగా సరిపోతుంది.

కాబట్టి మీరు ఏదైనా ఫంక్షన్ కి కానీ పార్టీ కి కానీ  అటెండ్ అవ్వాలి అనుకున్నపుడు, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ అందరిలో విభిన్నంగా కనిపించడానికి ప్రయత్నించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: