ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొబ్బరి పాలను డై బ్రష్ సాయంతో తలకు అప్లై చేసుకోవాలి.ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోవాలి.20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకొని షాంపూ చేసుకోవాలి.వారానికోసారి ఈ చిట్కా పాటించడం వల్ల మంచి ప్రయోజనం కనిపిస్తుంది.కొబ్బరి పాలల్లో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే విటమిన్ ఇ, పొటాషియం, ఫ్యాటీ ఆమ్లాలు, మినరల్స్ ఉంటాయి. ఇవి కురులను కుదుళ్ల నుంచి బలంగా అయ్యేలా చేస్తాయి. దీని వల్ల జుట్టు తెగిపోకుండా ఉంటుంది.వెల్లుల్లి రేకలు కొన్నింటిని తీసుకొని వాటిని చితక్కొట్టి గిన్నెలో వేయాలి.మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె పోయాలి.ఈ మిశ్రమాన్ని కుకింగ్ పాన్‌లో వేసి సన్నని సెగపై కొన్ని నిమిషాల పాటు వేడిచేయాలి.ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దాంతో స్కాల్ప్‌కు మసాజ్ చేసుకోవాలి.30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.వెల్లుల్లిలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సల్ఫర్ ఉంటుంది. ఇది కురుల పెరుగుదలను ప్రోత్సహించే కొల్లాజెన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది.  



వీటిని కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకొంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. గిన్నెలో ఉసిరి రసాన్ని తీసుకోవాలి.దీనిలో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసి వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి.దీనికి రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, టీస్పూన్ ఆలివ్ నూనె కలిపి మిశ్రమంగా చేయాలి.ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట సమయం ఆరనివ్వాలి.ఆ తర్వాత చల్లని నీటితో మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి.ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లకు రక్తసరఫరాను పెంచి వాటిని బలంగా మారుస్తుంది. ఇక ఉల్లి రసం అయితే స్కాల్ప్ పై ఉన్న క్రిములను నాశనం చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: