అందమైన ఆకట్టుకునే సౌందర్యవంతమైన ముఖం కోసం ఈ గృహ చిట్కాలను పాటించండి.బాదం గింజలను తీసుకొని వాటిని నానబెట్టాలి. బాగా నానిన తర్వాత వాటి తొక్క తీసి గింజలను పేస్ట్‌లా తయారుచేయాలి. ఆపై కొద్దిగా పాలు కలిపి ముఖానికి, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.బాదం గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. అలాగే నిర్జీవంగా మారిన చర్మకణాలకు జీవం పోస్తుంది. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.టమాటాను తీసుకొని దాన్ని స్పూన్ సాయంతో మెత్తగా చేయాలి. దీనిలో కొద్దిగా చక్కెర కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చేతి వేళ్లను తడి చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.ఇక టమాటాలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు చర్మం పీహెచ్ విలువను క్రమబద్ధీకరిస్తాయి.


చర్మం టోన్‌ను మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. దీనికి చక్కెరను కలిపి మసాజ్ చేసుకోవడం ద్వారా.. చర్మానికి రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.టేబుల్ స్పూన్ టమాటా గుజ్జులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.గంధపు చెక్కను రోజ్ వాటర్‌తో అరగదీసి.. దాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది.ఇక ఈ పద్ధతులు క్రమం తప్పకుండా పాటించండి.. ఆకట్టుకునే అందం మీ సొంతం అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: