సాధారణంగా ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మొటిమలు వచ్చి, ముఖాన్ని అందవిహీనంగా చేస్తున్నాయి. ఆ తర్వాత ముఖం మీద ఉన్న మొటిమలు తొలగించుకోవడానికి మనలో చాలామందికి సరైన మార్గాలు తెలియకపోవడం వల్ల వాటిని చేతులతో గిల్లడం, నొక్కడం లాంటి పనులు చేస్తుంటారు. ఫలితంగా మొటిమలను నొక్కడం, గిల్లడం లాంటి పనులు చేస్తే మొటిమలు తొలగిపోయి ఆ ప్రదేశంలో నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ  మచ్చలను వదిలించుకోవడం మాత్రం అతి కష్టతరం. అయితే మొటిమలు వచ్చిన తర్వాత ఎన్నో కాస్మెటిక్స్, క్రీమ్స్,  స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ మొటిమలు ఎందుకు వస్తాయో మాత్రం తెలియదు. ఇప్పుడు మనం మొటిమలు ఎందుకు వస్తాయో  తెలుసుకుందాం.

మనలో చాలామంది తెలియకుండానే ఒత్తిడికి గురి అవుతుంటారు.అయితే ఈ ఒత్తిడి శారీరకంగా, మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మొటిమలు ఎక్కువగా రావడానికి ఒత్తిడి కూడా ఒక కారణమే అని. అయితే చాలామంది హార్మోన్స్ వల్ల ఇలా జరుగుతుంది అని అనుకుంటారే తప్పా..అంతకంటే ఎక్కువగా వీటి గురించి ఆలోచించరు. ఇక ముందు రోజు రాత్రి మీ మీ పనులలో పడి,నిద్రపోవడమే మర్చిపోతారు. ఫలితంగా రాత్రి ఫేస్ చేసే ఒత్తిడే  ప్రొద్దున బ్రేక్ ఔట్స్ కి  కారణం కావచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా ఒత్తిడి ఎక్కువైనప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.  ఈ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. ఫలితంగా క్లాగ్డ్ పోర్స్  వస్తాయి.  మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియా అందులో పేరుకుపోతుంది. ఒత్తిడి వల్ల రాత్రి ఎక్కువ సేపు మేలుకొని  ఉంటే మాత్రం ఖచ్చితంగా మొటిమలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి వల్ల వచ్చే మొటిమలకి,హార్మోన్స్ లోపం వల్ల వచ్చే మొటిమలకి చాలా తేడా ఉంది. హార్మోన్స్ లోపం వల్ల వచ్చే మొటిమలు మాత్రం ఒక్కటిగానే వస్తాయి. అలాగే పీరియడ్ సమయంలో వచ్చే మొటిమలు కూడా ఒకటి రెండు మాత్రమే వస్తాయి. కానీ ముఖం మీద ఆయిల్  ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రదేశాలు అంటే నుదురు, గడ్డం, ముక్కు లాంటి చోట్ల మీ ఫేస్ లో టీ (T) జోన్ లో ఎక్కువగా ఆయిల్  ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఆ ప్రదేశంలో మొటిమలు గుంపులు గుంపులుగా వస్తాయి. ఈ మొటిమలు కేవలం ఒత్తిడి కారణంగానే వస్తాయి అని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్య తో బాధపడుతున్న వారికి మొటిమలు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా! ఎలాంటి కారణాల వల్ల మొటిమలు వస్తాయో? అయితే  మీ ఫేస్ పైన ఎలాంటి మొటిమలు వస్తున్నాయో తెలుసుకుని వాటికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: