ప్రతి అమ్మాయి అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను వాడుతూ ఉంటారు. అయితే వీటి వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ, కొంతకాలం తరువాత దుష్ప్రభావాలు కలగడం మాత్రం ఖాయం.. అయితే ముందుగా ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, వారి చర్మతత్వానికి ఏ క్రీమ్ లేదా ప్రోడక్ట్ లేదా ఫేస్ ప్యాక్ సెట్ అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ అలా తెలియని పరిస్థితిలో ఎలాంటి క్రీమ్ లేదా ప్రోడక్ట్ వాడిన, ఫేస్ ప్యాక్ వేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ చర్మ తత్వాన్ని బట్టి మీరు ఎంచుకునే ప్రొడక్ట్ కూడా దానికి తగ్గట్టు అనువుగా ఉండాలి. అప్పుడే అందం రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఏ స్కిన్ వాళ్లు ఏ ఫేస్ ప్యాక్ వాడాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


పొడిబారిన చర్మం కోసం :
చాలామంది పొడిబారిన చర్మం తో సతమతమవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఒక చిట్కాను అనుసరిస్తే, తప్పకుండా ఫలితం ఉంటుంది. పొడిబారిన చర్మం కలవారు ఈ పద్ధతిని తప్పకుండా చూసి పాటించాలి. ఎందుకంటే దీనివల్ల కలిగే లాభం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం ముఖ్యంగా కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టేబుల్ స్పూను ఉడికించి ముద్ద లాగ చేసుకున్న క్యాబేజ్.. ఇక వీటి తయారీ విధానం.. కొద్దిగా నిమ్మరసాన్ని ఉడికించి గ్రైండ్ చేసుకున్న క్యాబేజీలో వేసి, టీ స్పూన్ తేనె కూడా వేసి, బాగా పేస్టు లాగా తయారు చేయాలి. దీనిని ముఖానికి, మెడకు అప్లై చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక ఈ పద్ధతిని కనుక డ్రై స్కిన్ ఉన్నవారు అనుసరిస్తే తప్పకుండా మంచి లాభాలను పొందవచ్చు..


జిడ్డు చర్మం కోసం :
జిడ్డు చర్మం కలిగిన వారు ఎన్ని పద్ధతులను అనుకరించిన జిడ్డు అలా కారుతూనే ఉంటుంది. అయితే జుట్టు చర్మం కలిగిన వారు ఇప్పుడు చెప్పబోయే ఒక పద్ధతిని అనుసరిస్తే, తప్పకుండా ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ఇందుకోసం కావలసిన పదార్థాలు ఏమిటంటే. కొద్దిగా పసుపు, నిమ్మరసం, బొప్పాయి గుజ్జు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక వీటి తయారీ విషయానికొస్తే, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అలాగే మూడు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోండి. ఇప్పుడు బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. దీని వల్ల ఆయిల్ స్కిన్ వాళ్లు సూపర్ బెనిఫిట్స్ ను పొందవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: