ప్రతి ఒక్కరూ అందంగా వుండాలని కోరుకుంటారు. కాని టీనేజ్ లో వచ్చే మొటిమలతో లేక జిడ్డు బారిన చర్మంతో చాలా బాధపడుతూ వుంటారు. వాటి తగ్గుదల కోసం అనేక రకాల క్రీములు, పౌడర్లు వాడి ముఖాన్ని పాడు చేసుకుంటూ వుంటారు. ఇక అందమైన ముఖం కావాలనుకునేవారు ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.ఇక చాలా మందిని తరచూ వీధించే సమస్య మొటిమల సమస్య. మొటిమల సమస్యతో చాలా మంది టీనేజ్ నుంచి సతమతమవుతూ వుంటారు. అయితే మొటిమలు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో క్రీములు కొంటారు. అవి పనిచేయకపోతే బాధపడతారు. అయితే, ఈ సమస్యను మీ ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. ఇందుకు కలబంద మొక్క ఉంటే చాలు. కలబంద మధ్యలో ఉండే జిగురు తీసుకుని ముఖంపై మర్దనా చేయాలి. తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.


కొంతమందికి కళ్ళ కింద వాపులు వస్తుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు ఒక స్పూన్‌ను చల్లగా ఉండటానికి ఫ్రిడ్జ్ లో   పెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత స్పూన్ బయటకు తీసి కంటిపై 20 సెకన్లు ఉంచండి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేస్తే కళ్ల వాపు తగ్గి.. మీ ముఖం మళ్లీ అందంగా మారుతుంది.వేసవిలో ముఖం కమిలిపోవడం సర్వ సాధారణమే. ఈ సమస్య తీరాలంటే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది. ఒక వేళ లోషన్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి కమిలిన చోట రాయండి. వెంటనే చర్మం సాధారణ రంగులోకి మారిపోతుంది.ఇక జిడ్డు సమస్య తో బాధ పడేవారు ఫేస్ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లండి. ఇది మీ ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చేతిలో జస్ట్ రెండు చుక్కలు శానిటైజర్ వేసుకుని దూదితో ముఖాన్ని తుడుచుకుంటే చాలు.. ముఖం క్లీన్‌ అయ్యి చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: