చాలా మంది కూడా తెల్లని ముఖం కావాలని కోరుకుంటారు. ఇక తెల్లటి ముఖం కోసం ఈ చిట్కాలని పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఆ చిట్కాలు ఏంటో తెలుసుకోండి.నిమ్మకాయ అలాగే తేనే ఈ రెండు కూడా  వంటింటిలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ రెండిటి కలయికలో ఈ మాస్క్ ని తయారుచేయటం కూడా చాలా ఈజీ. ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ తేనే తీసుకోని బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత వెచ్చని నీటితోముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ మాస్క్ వేసుకున్న తర్వాత మీ ముఖం స్పష్టంగా ఇంకా మృదువుగా మారుతుంది.తేనె ఇంకా బాదం రెండు కూడా చర్మాన్ని తెల్లగా చెయ్యటానికి అద్భుతంగా పనిచేస్తాయి.అవి చర్మం తేమను అలాగే ఉంచి టాన్ ను తొలగిస్తుంది. మీరు సులభంగా ఈ మాస్క్ ను తయారుచేయవచ్చు. ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ పాల పొడి,అర స్పూన్ బాదం పొడి లేదా ఆయిల్ లను బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.



నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను తగ్గిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ దోసకాయ రసం తీసుకోని బాగా కలిపి ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. దోసకాయ మీ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను తగ్గిస్తుంది.ఇది వేసవికాలం కోసం ఒక మంచి పరిపూర్ణమైన ఫేస్ ప్యాక్ అని చెప్పవచ్చు.ఒక స్పూన్ పాలు,తేనె మరియు నిమ్మ రసం తీసుకోని మృదువుగా పేస్ట్ చేయండి. దీనిని మీ ముఖానికి,మెడకు బాగా పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు-మూడు సార్లు చేస్తే,మీ చర్మం మీద అన్ని రకాల మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: