సాధారణంగా చాలా మందికి అనేక రకాల చర్మ సమస్యలు అనేవి ఉంటాయి.చాలా మంది మొటిమలు, యాక్నే మచ్చల సమస్యలతో చాలా తీవ్రంగా సతమతం అవుతుంటారు. కాబట్టి అలాంటివారు ఖచ్చితంగా ఈ ఫేస్ ఆయిల్స్ వాడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే చర్మ సమస్యకి ఫేస్ ఆయిల్ వల్ల చర్మానికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకోండి.


ఇక ఏ స్కిన్ టైప్ వారైనా ఫేస్ ఆయిల్ ని చాలా పుష్కలంగా వాడొచ్చు.ప్రత్యేకించి ముదురు చర్మం ఉన్న వారికి ఇది చక్కని పోషణనిస్తుంది. మీరు మాయిశ్చరైజర్ చేసుకున్న తరువాత తరువాత ఫేస్ ఆయిల్ రాస్తే చర్మానికి తేమని కలిగించే ఇన్‌గ్రీడియెంట్స్‌ని ఇది సీల్ చేస్తుంది. దాంతో చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. మీది పొడిబారిన చర్మం గాని అయితే ఉదయం అలాగే రాత్రి మాయిశ్చరైజర్ తరువాత ఫేస్ ఆయిల్ అప్లై చేయండి. మీది జిడ్డు చర్మం అయితే రాత్రి మాత్రమే అప్లై చేయండి.


ఇక సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ అందరికి చర్మం చాలా డల్‌గా, డ్రైగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే, ఈ సమయంలో చర్మం నాచురల్ ఆయిల్స్‌ని ఉత్పత్తి చేయడం తగ్గించేస్తుంది.మీరు ఎక్కువగా నీరు తాగకపోయినా, సరిపడినంత నిద్ర మీకు లేకపోయినా, క్రమంగా ఎక్స్‌ఫోలియేట్ చేయకపోయినా కూడా మీ చర్మం చాలా డల్‌గా కనిపిస్తుంది.దీనికి కారణం ఏదైనా కానివ్వండి, ఫేస్ ఆయిల్స్ వల్ల చర్మానికి  మంచి గ్లో అనేది వస్తుంది. ఫేస్ ఆయిల్‌ని హై పాయింట్స్‌లో ఉపయోగిస్తే చాలా మంచిది.



మొటిమల చర్మానికి అలాగే ముదురు చర్మానికి ఎక్కువ ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ ఉంటాయి. అందుకే వీరు రిచ్ ఫేస్ ఆయిల్ వాడాలి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అవకాడో, గ్రేప్ సీడ్ ఆయిల్ వీరికి చర్మం ముదురు కాకుండా సహాయం చేస్తాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి, అలాగే మంచి మెరుపుని ఇస్తాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: