పువ్వు జుట్టుకే కాదు అందం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ పూలతో ఇలా చేస్తే అందమైన చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆ పూలు ఏంటో తెలుసుకోండి.

ఇక బంతి పూల వల్ల మంచి సువాసన  వస్తుందని తెలిసిన విషయమే. ఇక ఇండియాలో అమ్మాయిలు జుట్టు అందం కోసం వీటిని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు.ఇక బంతి పువ్వు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బంతి పువ్వుని క్యాలెండ్యూలా అని కూడా అంటారు. ఇక దీన్ని సాధారణంగా చలి కాలంలో దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఈ పువ్వుతో క్యాలెండ్యూలా ఆయిల్‌ని కూడా తయారు చేస్తూ ఉంటారు.ఇక ఈ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.ఇది మన స్కిన్ కి ఎంతో మేలు చేస్తుంది కూడా.


ఇక స్కిన్ కి మంచి బెనిఫిట్స్ కలగాలంటే.. అర కప్పు బంతి పూలను తీసుకోండి. అలాగే వాటిని ఒకటిన్నర కప్పు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వచ్చే నీళ్ళని తీసేసి ఆ రేఖలని పిల్లలకి స్నానం చేయించడానికి వాడండి. ఒక వేళ ఏమైనా దోమలు కుట్టిన చర్మం పాడవకుండా బాగా సహాయం చేస్తుంది. ఆ పూరేకులతో మెత్తని పేస్ట్ తయారు చేసి ముఖానికి పట్టించి మాస్క్ వేసుకుంటే అందమైన మెరిసిపోయే చర్మం మీ సొంతం అవుతుంది.

ఇక అపరాజిత పూలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పువ్వు చర్మం సాగిపోకుండా చూస్తుంది.ఇక అలాగే ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అనేక రకాల చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. స్కిన్ పై ఎరుపుదనం కలిగినా కూడా ఇది పోగొడుతుంది.ఇక అదే విధంగా చర్మం డ్రై అయిపోయినా కూడా ఇది ఉపయోగ పడుతుంది. స్కిన్ ఇరిటేషన్‌ లాంటివి ఉంటే కూడా ఈ పువ్వు సులువుగా పోగొడుతుంది.
అలాగే స్కిన్ మాయిశ్చర్‌గా ఉండేటట్టు ఈ పువ్వు చూస్తుంది. ఇక ఈ పూలలో హెర్బల్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా ఈ పువ్వు మంచి పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. అయితే దీని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే ... ముందుగా ఒక టేబుల్ స్పూన్ అపరాజిత పొడిని తీసుకోవాలి. ఇక దానిలో కావలిన్ క్లే ఒక టేబుల్ స్పూన్ తీసుకుని కలపాలి.


దీనిలో కొంచెం రోజ్ వాటర్ కూడా వేసి ఒక మెత్తని పేస్ట్ లాగ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత ముఖం శుభ్రంగా కడిగేసుకుంటే మంచి మేలు కలుగుతుంది. ఏ చర్మం వాళ్లకి అయినా సరే ఇది బాగా సెట్ అయిపోతూ ఉంటుంది. ఇక అలాగే మంచి క్లెన్సింగ్‌తో పాటు చర్మం ఎంతో అందంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. దీనితో మీకు మీ ముఖ సౌందర్యంకి చక్కని ప్రయోజనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: