ఇక బయట దుమ్ము, ధూళి వంటివి ఎక్కువగా ఉండడంతో ముఖానికి వేసవిలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది.అందుకే ఈ సమయంలో మీ ముఖాన్ని రోజుకు రెండు నుండి మూడు సార్లు కడుక్కోవడం మంచిది. ఇలా కడుక్కోవడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, జిడ్డు వంటివి తొలగిపోతాయి. ఇక దీంతో మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక చర్మ సమస్యల నుండి బయట పడాలంటే ఈ టిప్‌ని పాటించండి.ఇక అదే విధంగా డీహైడ్రేటెడ్ చర్మం వాళ్లు హైడ్రేటింగ్ సీరంని ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు. దీంతో చర్మం చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇంకా ముడతలు రాకుండా కూడా ఉంచుతుంది. కాబట్టి ఇది కూడా మంచిది కనుక తప్పకుండా వాడండి.

జిడ్డు చర్మం వున్న వాళ్లు వారానికి రెండు సార్లు మీ స్కిన్ ని ఎక్స్ ఫోలియెట్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు ఎక్స్ ఫోలియెట్ చేయడం వల్ల పింపుల్స్, యాక్నీ, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటివి రావు. అలాగే ఆయిల్ స్కిన్ వాళ్లు రెగ్యులర్ గా మాయిశ్చరైజింగ్  అలాగే హైడ్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలా అని ఎక్కువ మాయిశ్చర్ చేసిన అంత మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వాడే మాయిశ్చరైజర్లు ఆయిల్ ఫ్రీ, వాటర్ బేస్డ్ మాత్రమే చర్మానికి ఉపయోగించండి.అందువల్ల వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది.ఇక అదే విధంగా మీరు మేకప్ వేసుకునే ముందు ప్రైమర్‌ని వాడటం మంచిది.ఇది కూడా ముఖంపై ఆయిల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.

ఇక అదే విధంగా స్కిన్ కి ఆల్కహాల్ లేని టోనర్‌ని ఉపయోగించండి. దీనిని ఉపయోగించడం వల్ల ఎక్కువ అనేది ఆయిల్ తొలగిపోతుంది. ఇంకా అలాగే చర్మంపై దుమ్ము, ధూళి కూడా లేకుండా ఇది చేస్తుంది.అలాగే వారానికి ఒక సారి మీరు మంచి షీట్ మాస్క్ లేదా పీల్ మాస్క్‌ని ఉపయోగించండం మంచిది. ఇది కూడా మీకు చక్కని ప్రయోజనం అందిస్తుంది.ఇక ఈ మాస్క్ వాడేటప్పుడు చార్ కోల్ మాస్క్‌ని ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అలాగే ఇది మీ చర్మాన్ని చాలా క్లియర్‌గా ఉంచుతుంది.అందుకే దీనిని కూడా  పాటించడం వల్ల ముఖం పై ఆయిల్ కంట్రోల్లో ఉంటుంది. ఇక అలాగే మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ముఖం చాలా ఫ్రెష్ గా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: