ఒకొకరిది ఒకో రకమైన జుట్టు, కొందరిది సిల్కీగా ఉంటే కొందరిది కర్లీ గా  ఉంటుంది,మరికొందరికి వెవి ఇలా రక రకాల జుట్లు ఉంటాయి. జుట్టు ఏ రకం అయిన కానీ వెంట్రుకలు సాఫ్ట్ అండ్ స్మూత్ ఉండాలి అని కోరుకుంటారు ఎవరైనా. కొందరికి పుట్టుకతోనే సాఫ్ట్ హెయిర్ అనేది వస్తుంది. ఇప్పుడు మరి అలా లేని వారి పరిస్థితి ఏంటి అని అంటే కనుక కొన్ని చిట్కాలు పాటిస్తూ కొంచెం వెంట్రుకల ని జాగ్రత్తగా చూసుకుంటే మృదువైన మరియు ఆరోగ్యకరమైన శిరోజాలను మీ  సొంతం చేసుకోవచ్చు.
ఎపుడైనా అరటిపండు ను  వెంట్రుకలకు పెట్టుకున్నారా? ఏంటి అరటిపండు చూస్తే చక్కగా తినాలి అనిపిస్తుంది కానీ వెంట్రుకలకు ఎలా పెట్టుకుంటారు అని అనుకోకుండా ఈ హోం మేడ్ బనానా హెయిర్ ప్యాక్  ను  ఒకసారి ట్రై చేయండి.

హెయిర్ మాస్క్:ఒక అరటిపండు గుజ్జు ను తీసుకొని దానిలో ఒక కోడిగుడ్డు వేసి ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి( కోడి గూడు  వాసన భరించగలం అని అనుకుంటే గుడ్డుని మొత్తం వేయండి, వాసన పడని వారు గుడ్డులోని తెల్లని సోనా మాత్రం వేసుకోండి).
ఈ పేస్ట్ లో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకోవాలి. మన హోం మేడ్ హెయిర్ మాస్క్ రెడీ. తల స్నానం చేసి జుట్టు మొత్తం ఆరి పొడి అయిన తర్వాత ఈ హెయిర్ ప్యాక్ ను స్కాల్ప్ నుంచి జుట్టు కోణాల వరకు అంతటా వేసుకోవాలి. జుట్టును ముడి వేసుకొని ఒక హెయిర్ కాప్ పెట్టుకొని ఒక 15 - 20 నిమిషాల పాటు దానిని ఆరనివ్వాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత  నీళ్లతో జుట్టు కడుకొని, షాంపూ పెట్టుకొని తల స్నానం చేస్తే సరిపోతుంది.

ఇలా 15 రోజులకు ఒకసారి క్రమం గా  ఈ హెయిర్ ప్యాక్ వాడటం వల్ల వెంట్రుకలు లో ఉన్న రఫ్ నెస్  పోయి హెయిర్  చాలా సాఫ్ట్ మరియు స్మూత్ గా మారుతుంది. స్పిల్ట్స్ లాంటివి కూడా తొలగి పోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: