పురుషులకు కూడా అందంగా హ్యాండ్సమ్ గా కనిపించాలని ఉంటుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే ఇలా ఉండాలి అంటే వారి శరీర ఆకృతి చక్కగా ఉండాలి. మంచి పొడవు, దృఢమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం ఇలా ఉంటే ఎవరు మీ వైపు నుండి చూపు పక్కకు తిప్పుకోలేరు. అయితే కొందరి పురుషుల ఛాతీ బిగువుగా కాకుండా వదులుగా ఉండి వారు ఫిట్ గా కనిపించరు. అయితే ఇలాంటి వారు వారి ఛాతీని పర్ఫెక్ట్ షేప్ లోకి తీసుకురావాలి అనుకుంటే ఈ సూచనలు పాటించాలని, ఇలా వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.

* ప్రతి రోజూ రన్నింగ్ చేయాలి. కనీసం ప్రతి రోజూ ఉదయాన్నే రెండు కిలోమీటర్లు అయినా చెమటలు పట్టేలా పరుగులు తీయాలి. నిద్ర లేవ గానే ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం అలాగే పరుగు తీసే సమయంలో కాస్త జ్యూస్ తీసుకోవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన పురుషులకు ఛాతీ వద్ద అనవసరంగా పేరుకుని పోయిన కొవ్వు కరిగి ఛాతీ వదులుగా కాకుండా దృఢంగా మారడానికి సహాయ పడుతుంది.

* పుష్ అప్ లు అనేవి పురుషులకు ఒక చక్కని వ్యాయామం. ఇది ఛాతీ దగ్గర వదులు తగ్గించి దృఢంగా చేయడానికే కాదు. నడుము వద్ద కొవ్వును తగ్గించి ఒక మంచి షేప్ ను మీకు ఇస్తుంది.  అయితే ఈ వ్యాయామాన్ని రన్నింగ్ లేదా స్కిప్పింగ్ వంటి వ్యాయామాలు తర్వాతే చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పుష్ అప్ లు చేసేముందు కొంత వామ్ అప్ అవసరమట.

* స్కిప్పింగ్ చేయడం వలన కూడా పురుషుల్లో ఛాతీ బాగా దృఢంగా ఆకర్షణీయంగా మంచి ఆకృతిలో మారడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వలన మీ శరీర బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఒకసారి మొదలు పెడితే కనీసం 100 జంపింగ్ లైనా చేయండి. మీకు మరీ కష్టమనిపిస్తే
కాస్త నెమ్మదిగా ఆపకుండా చేయండి.

ఈ మూడు వ్యాయామాలు పురుషులు తమ చక్కటి ఛాతీ ఆకృతి కోసం మెరుగైన ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: