ఇక ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో మెరిసే అందమైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ మంచి అందమైన చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రొడాక్ట్స్‌ రెగ్యులర్ గా వాడాలి.ఇక అంత అవసరం లేదు. ఇక మీరు ఇంట్లో వంటింట్లో వాడే పంచదార తోనే కోల్పోయిన మీ ముఖం మెరుపును తిరిగి మళ్ళీ చాలా ఈజీగా పొందవచ్చు.

ఇక ఒక చెంచా పంచదార ఇంకా అలాగే పెరుగుని తీసుకొని ఇక ఆ రెండింటినీ కూడా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇక ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా ముఖాన్ని బాగా మసాజ్ చేయాలి. ఇక ఇలాగ చేయడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలలో దాగిన చెడు అనేది పూర్తిగా బయటకు వస్తుంది. ఇక మీ ముఖంపై గ్లో అనేది వస్తుంది. ఇక ఆ తరువాత 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇక నిమ్మకాయ కూడా ఎల్లప్పుడూ మీ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని తీసుకొని చక్కెరతో కలిపి దానిని ముఖానికి అప్లై చేయవచ్చు.ఇక ఇలా కనుక మీరు చేస్తే ముఖంపై ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే అర టీస్పూన్ నిమ్మరసాన్ని ఒక టీస్పూన్ పెరుగులో వేసి బాగా కలపండి.ఇక తేలికపాటి చేతులతో ఈ పేస్ట్‌ని ముఖానికి బాగా అప్లై చేసి మెత్తగా మీ ముఖాన్ని మసాజ్ చేయండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత ముఖాన్ని బాగా శుభ్రమైన నీటితో కడగాలి.

ఇక అలాగే షుగర్ స్క్రబ్‌తో ముఖానికి బాగా మసాజ్ చేయడం వల్ల మీ చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. ఇక పంచదారలో అర టీస్పూన్ నిమ్మరసం ఇంకా అలాగే ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి అప్లై చేయాలి.ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఇక అలాగే 1 టీస్పూన్ ముతక చక్కెరను తీసుకుని ఆపై కొద్దిగా బాదం నూనె, తేనె ఇంకా కాఫీ కలిపి బాగా పేస్ట్‌లా తయారు చేయాలి. ఇక దానిని మీ ముఖానికి బాగా అప్లైచేసి ఒక 10 నిమిషాలు పాటు ఆరనివ్వాలి.ఇక ఆ తర్వాత ముఖాన్ని కడిగేస్తే మీ ముఖంపై ఉన్న మచ్చలు వెంటనే తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: