ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వయస్సుతో సంబందం లేకుండా అధిక బరువు సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు. అందుకు కీర దోస ఉపయోగించి అధిక బరువు సమస్య తొలగించుకోవటానికి ఒక డ్రింక్ ని మనం తయారుచేసుకొని తాగితే ఈ సమస్య నుంచి ఈజీగా బయట పడొచ్చు.పైగా ఈ డ్రింక్ వేసవి కాలంలో కూడా మనకు చాలా బాగా సహాయపడుతుంది.ఎందుకంటే కీరదోస లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఈ డ్రింక్ తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది దాంతో మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. ముందుగా కీరదోస కాయతో జ్యూస్ చేయడానికి కీర దోసను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే దాన్ని కట్ చేసినప్పుడు మాత్రం కీర దోస తొక్కలను తీయకూడదు.


ఎందుకంటే ఆ తొక్కలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఆ తరువాత ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి దానిలో కొన్ని కరివేపాకు ఆకులను,నీటిని పోసి మిక్సీ చేసి గ్లాసు లో పోసి దానిలో అరచెక్క నిమ్మరసం ఇంకా కొంచెం జీలకర్ర పొడి కలిపి తాగాలి. మనం ఈ డ్రింక్ ప్రతి రోజు ఉదయం పూట తాగవచ్చు. లేదా మీకు వీలు ఉన్నప్పుడూ కూడా తాగవచ్చు. అయితే తాగటానికి ముందు రెండు గంటలు కడుపు ఖాళీగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే అలా అయితేనే ఈ డ్రింక్ బాగా పని చేస్తుంది. ఈ డ్రింక్ ని మీరు క్రమం తప్పకుండా తాగితే చాలా త్వరగా అధిక బరువు తగ్గి సన్నగా అందంగా మారతారు. ఈ డ్రింక్ కేవలం బరువు తగ్గాడానికే కాదు బాడీలో వేడిని కూడా తగ్గించి బాడీని బాగా కూల్ చేస్తుంది. అలాగే డ్రింక్ లోని పోషకాలు మిమ్మల్ని అందంగా తెల్లగా మార్చడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగండి. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: