పైనాపిల్ అనేది చర్మానికి చాలా మంచిది. ఇది మీ చర్మానికి ఎన్నో అద్భుతాలు చేస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే పైనాపిల్‌లో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం ప్రకారం బ్రొమెలిన్ అనే ఎంజైమ్ శరీరంలోని వాపులను చాలా ఈజీగా తగ్గిస్తుంది. దీంతో చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల పైనాపిల్‌ను మీరు ప్రతి రోజూ కూడా డైట్‌లో చేర్చుకుంటే మీ చర్మ కాంతి పెరుగుతుంది. ఇది మీ ముఖంలో సహజసిద్ధమైన మెరుపుని తీసుకువస్తుంది.పైనాపిల్‌, కీరదోసతో తయారు చేసిన జ్యూస్ ప్రతి రోజూ తీసుకుంటే మీ చర్మానికి చాలా మేలు కలుగుతుంది. ఎందుకంటే ఈ కీరదోసలో చర్మాన్ని సంరక్షించే ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. అంతేగాక కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది మీ చర్మానికి మంచి తేమను అందిస్తుంది. దీంతో మీ చర్మం మెరుస్తుంది. ఇంకా అలాగే కీరదోసలో విటమిన్ సి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. 


ఇవన్నీ కూడా మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే దీన్ని తీసుకుంటే చర్మం డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు.దీంతోపాటు మీ చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.ఇక ఈ పైనాపిల్‌, కీరదోసతో డ్రింక్ తయారు చేయడం చాలా సులభం. అయితే మీకు ఇందుకు కేవలం నాలుగు పదార్థాలు ఉంటే చాలు. కీరదోస, పైనాపిల్‌, కొన్ని తాజా పుదీనా ఆకులు, నిమ్మరసం. వీటన్నింటినీ తీసుకొని వాటిని బ్లెండర్‌లో వేసి డ్రింక్ లాగా తయారు చేయాలి. ఆ తరువాత అందులో నీళ్లను కలపాలి. ఇంకా ఈ డ్రింక్‌ను గ్లాసులో పోసేటప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేయాలి. ఆ తరువాత డ్రింక్ మీద పుదీనా ఆకులను చల్లి గార్నిష్ చేసుకోవాలి. ఇంకా అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కీరదోస, పైనాపిల్ డ్రింక్ ఈజీగా రెడీ అవుతుంది. దీన్ని మీరు ప్రతి రోజూ కనుక తాగితే కచ్చితంగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా మారుతుంది. అలా యవ్వనంగా కనిపించాలని కోరుకునే వారు ఈ డ్రింక్‌ను ప్రతి రోజూ తాగితే కచ్చితంగా చక్కని ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: